Butta Renuka to join TDP today బుట్టా రేణుకకు ఇన్నాళ్లకు ముహూర్తం కుదిరింది..

Mp butta renuka suspended from ysrcp joins tdp

Butta Renuka, Butta Renuka Joins TDP, Butta Renuka YSRCP MP, Kurnool MP Butta Renuka, YSRCP, Renuka, TDP, Butta Renuka to join TDP today, YS Jagan Mohan reddy, Chandrababu naidu, nara lokesh, andhra pradesh, defection, politics

Senior Leader of YSRCP and Kurnool MP Butta Renuka is all set to join the Telugu Desam Party (TDP). She the Fourth richest MP with assets of over Rs 250 crore in 16th Loka Sabha.

బుట్టా రేణుకకు ఇన్నాళ్లకు ముహూర్తం కుదిరింది..

Posted: 10/17/2017 09:54 AM IST
Mp butta renuka suspended from ysrcp joins tdp

నంద్యాల ఉపఎన్నికల, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల వెల్లడైన తరువాత.. ఎన్నికలలో ఎన్ని అవకతవకలు జరిగాయన్న అంశాన్ని పక్కన బెడితే.. ప్రజల్లోకి బలంగా వెళ్లిన సంకేతాలు రానున్న ఎన్నికలలో తమ పార్టీపై ప్రభావం చూపుతాయని భావించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులలో నూతనోత్తేజం నింపేందుకు నవంబరు 2నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

గత కొంతకాలంగా బలంగా వస్తున్న సంకేతాల నేపథ్యంలో ఎట్టకేలకు వైసీపీ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరనున్నారు. గత రెండేళ్లుగా అమె అధికార పార్టీ తీర్థం తీసుకుంటారన్న సంకేతాలు వస్తున్నా.. వాటిని అమె ఖండిస్తూ వచ్చారు. ఇక నారా లోకేష్ కర్నూలు పర్యటనలో కూడా ఈ వార్తలు బలంగా వినిపించాయి. ఇక ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న వార్తలకు ఇవాళ నిజమయ్యాయి. అమె అధికార పార్టీ తీర్థం తీసుకునేందుకు ఇవాళ ముహూర్తం కుదిరింది.

ఈ మేరకు ఆమె ఇవాళ విజయవాడలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి సహా పలువురు పార్టీ క్రీయాశీలక నేతలతో కలసి అమె అమరావతిలోని చంద్రబాబు కార్యాలయానికి వెళ్లిన ఆమె అక్కడ ముఖ్యమంత్రిని కలిసారు. కాగా బుట్టా రేణుకతో పాటు అమెతో వచ్చిన నేతలను చంద్రబాబు సాధరంగా అహ్వానించారని సమాచారం. త్వరలోనే రేణుక టీడీపీలో చేరికపై అధినేత అధికారిక ప్రకటనను చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : butta renuka  Kurnool MP  ysrcp mp  ysrcp  tdp  chandrababu  ys jagan  andhra pradesh. politics  

Other Articles