Cylinder blast in Bangalore kills Few People | సిలిండర్ బ్లాస్ట్.. బెంగళూరులో తీవ్ర విషాదం

Bangalore cylinder blast killed few lives

cylinder blast, lpg cylinder blast, domestic cylinder blast, blast in banglore, blast in Ejipura Area, pregnant woman dead, six dead, trapped under debris, Bengaluru, Bangalore Cylinder Blast

In a tragic incident in Bangalore 4 houses collapsed partially in Ejipura Area due to LPG cylinder blast; 6 dead, many still feared to be trapped under debris.

ఎవరిదో అలక్ష్యం.. బెంగళూరులో తీవ్ర విషాదం

Posted: 10/16/2017 11:06 AM IST
Bangalore cylinder blast killed few lives

భారీ విస్పోటనం ధాటికి ఇంటితో పాటు పక్కనున్న నాలుగు ఇళ్లు కూడా కుప్పకూలిపోయాయి. సోమవారం కర్ణాటక రాజధాని బెంగుళూరులో తీవ్ర విషాదం అలుముకుంది. బెంగుళూరులోని ఇజిపురా ప్రాంతంలో ఆరుగురు అకస్మాత్తుగా మృత్యువాత పడ్డారు. ఎజీపుర ప్రాంతంలోని ఓ ఇంట్లో వంట చేస్తున్న గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ఎనమిది నెలల గర్భణీ మహిళ సహా ఆరుగురు మరణించగా, శిధిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ బలగాలు.. హుటాహుటిన రంగంలోకి దిగి.. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టారు. పలువురు బాధితులను శిధిలాల నుంచి రక్షించి చికిత్స కోసం అస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానిక అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. కాగా ఇవాళ ఉదయం వరకు తమతో వున్న వ్యక్తులు ఒక్కసారిగా మరణించడంతో.. తీవ్ర అవేదనకు గురవుతున్న మృతుల బంధువుల రోధనలతో స్థానికంగా విషాదం అలుముకుంది. ఇక అటు అస్పత్రుల వద్ద కూడా, క్షతగాత్రులు అర్థనాధాలు వారి బంధవులు రోదనలతో విషాదం నెలకొంది.

బెంగళూరులో ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో కాసింత అలక్ష్యమో లేక నిర్లక్ష్యమో తెలియదు కానీ ఏకంగా అరుగురు ప్రాణాలను బలితీసుకుంది. ఎల్పీజీ సిలిండర్లతో ఎలా వ్యవహరించాలన్న విషయమై ఇదివరకు ఒకింత జాగ్రత్తలు, సూచనలు చేసిన కేంద్ర ఇంధన శాఖ.. ఈ మధ్యకాలంలో అసలు సూచనలను చేయడమే లేదు. కేవలం మారుతున్న అంతర్జాతీయ రేట్ల దృష్ట్యా సంస్థ దృష్టంతా రేట్లను ఎలా పెంచాలా..? లాభాలను ఎలా అందుకోవాలా..? అన్నదానిపైనే కానీ.. తప్పనిసరిగా ఏడాది, రేండేళ్ల కో పర్యాయమైనా ప్రతీ ఇంటిలో గ్యాస్ తనిఖీలు చేయాల్సిన బాధ్యతను కూడా ఆయా కంపెనీలు గాలికివదిలేస్తున్నాయి.

అనుమానాలు?

కాగా, కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి ఘటనపై అనుమానాలు ఉన్నట్లు మీడియాతో చెప్పారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అయితే సిలిండర్ బ్లాస్ట్ అవునో కాదో విచారణలో తెలాల్సి ఉందని ఆయన అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థుల్లో ఎవరికీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ లేదని.. కాబట్టి ముందుగానే ఇది సిలిండర్ పేలుడు అన్న దృవీకరణకు రాలేమని మంత్రి వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles