YS Jagan Meets BC Communities before Padayatra | పాదయాత్రకు ముందు కీలకం.. కులాలవారీగా సమావేశం

Ys jagan key meeting before padayatra

YSR Congress Party, BC Declaration, YS Jagan, YS Jagan BC Communities, AP BC Communities, YS Jagan Caste Politics

YSR Congress Party Chief YS Jagan mohan reddy meet BC Communities today and released BC Declaration.

పాదయాత్రకు ముందు కీలక సమావేశం

Posted: 10/16/2017 09:30 AM IST
Ys jagan key meeting before padayatra

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆరు నెలలపాటు రాష్ట్ర మంతటా కాలినడకన తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ కేడర్ ను సిద్ధం చేసేందుకు పావులు కదుపుతున్నారు. తండ్రి, దివంగత సీఎం వైఎస్ సెంటిమెంట్ ను బలంగా ప్రజల్లోకి చేరవేయటం ద్వారా గెలుపు సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్లబోతున్నారు.

ఈ క్రమంలో నేడు ఓ కీలక సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. బీసీ సంఘాలతో కీలక సమావేశం జరపనున్నారు. రాష్టంలో 50 శాతానికి పైగా జనాభా ప్రాతినిధ్యమున్న బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతి, అందుతున్న సంక్షేమ పథకాలు, తదుపరి దశలో తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై వివిధ బలహీన ొర్గాల సంఘాల నేతలతో జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించి.. బీసీలకు తాము అండగా ఉన్నామన్న ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు వైకాపా నేతలు మాట్లాడుతూ... రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పరిస్థితి, వారి సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాల అన్వేషణ తదితరాలను చర్చించేందుకు ఈ సమావేశం జరగనుందని చెప్పారు. అన్ని వర్గాల వారి అభిప్రాయాలను సేకరించడమే జగన్ లక్ష్యమని, పాదయాత్రకు ఈ సమావేశం ఉపకరిస్తుందన్న ఆశాభావం వారు వ్యక్తం చేస్తున్నారు. కాగా, అన్ని జిల్లాల నుంచి బీసీ నేతలు ఈ సమేవేశానికి వస్తుండటంతో, జగన్ పాదయాత్రకు జన సమీకరణ తదితరాలపై నేతలకు దిశానిర్దేశం చేయవచ్చని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles