Aadhar link up with All Schemes Last Dates | అలర్ట్.. ఆధార్ తో అనుసంధానికి ఇవే ఆఖరు తేదీలు

Aadhar links important dates

Aadhar Card, Aadhar Card Links Last Date, Aadhar Card Pan Last Date, Aadhar Card SIM Link, Aadhar Card Important Dates, Aadhar Card Alerts, Aadhar Card Bank Account

Aadhar Card links up important Dates. The Union Government fixes last date for PAN, SIM Card, LPG Gas, Bank Account, Schemes etc.

ఆధార్ తో లింకులకు తుది గడువు

Posted: 10/16/2017 08:45 AM IST
Aadhar links important dates

దేశంలో ఇప్పుడు ప్రతీది ఆధార్ తోనే ముడిపడి ఉంది. దరఖాస్తుల దగ్గరి నుంచి ప్రయాణాల వరకు... చివరకు దైవ దర్శనానికి కూడా తప్పనిసరిగా మారింది. నిత్యావసరాలైన వంట గ్యాస్, రేషన్ ఇలా.. ఫించన్ నుంచి ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందాలన్న ఆధారే ఆధారం. భూముల కొనుగోలు, విక్రయాలు, కొత్త సిమ్ కార్డు నెంబర్, రేషన్, పాన్ కార్డులు, పాస్ పోర్టు, బ్యాంకు ఖాతా... ఇలా ఏది తీసుకోవాలన్నా 12 అంకెల ఆధార్ కార్డు తప్పనిసరి.

అయితే ప్రస్తుతం పలు కీలక సేవా విభాగాలతో ఆధార్ అనుసంధానం శరవేగంగా సాగుతోంది. సుప్రీం కోర్టులో కేసుల సంగతి పక్కన పెడితే ఆధార్ అనుసంధానానికి కొన్నింటిట్లో ఎప్పటి వరకు తుది గడువు ఉందో ఓసారి చూద్దాం.

సిమ్ కార్డు... ఆఖరు తేదీ ఫిబ్రవరి, 2018

సిమ్ కార్డులు దుర్వినియోగం కావడానికి ఆధార్ ఉపకరిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత టెలికం సెంటర్ లకు వెళ్లి, మొబైల్ నంబర్ చెబితే, ఆ నంబర్ కు ఓ ఓటీపీ వస్తుంది. ఓటీపీతో పాటు ఆధార్ నంబర్ ఇచ్చి, బయో మెట్రిక్ మిషన్ పై వేలిముద్రను వేస్తే ఆధార్, మొబైల్ అనుసంధానం పూర్తవుతుంది. కొత్త సిమ్ కార్డులయితే, ఆధార్ ఆధారిత ఈ-కేవైసీతోనే కంపెనీలు సిమ్ కార్డులను జారీ చేస్తున్నాయి.

బ్యాంక్ అకౌంట్.. ఆఖరు తేదీ డిసెంబర్ 31, 2017

బ్యాంకుకు వెళ్లి చేసుకోవచ్చు. కుదరకపోతే నెట్ బ్యాకింగ్, ఏటీఎం, ఎస్ఎంఎస్ లేదా మొబైల్ బ్యాకింగ్ విధానంతో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ సంవత్సరం చివరిలోపు అనుసంధానం పూర్తి కాకుంటే బ్యాంకు ఎకౌంట్లను సస్పెన్షన్ లో ఉంచుతారు.

పాన్ కార్డుతో.. ఆఖరు తేదీ డిసెంబర్ 31 2017

వాస్తవానికి పాన్, ఆధార్ గడువు ఆగస్టుతోనే ముగిసినా, ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్ తప్పనిసరి కావడంతో గడువును పెంచారు. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పేజీలో సులువుగానే అనుసంధానాన్ని పూర్తి చేయవచ్చు.

సబ్సిడీ అందించే పథకాలకు... ఆఖరు తేదీ డిసెంబర్ 31 2017

వివిధ సామాజిక భద్రతా పథకాల ద్వారా ప్రయోజనాలను పొందే వారంతా ఆయా పథకాలతో ఆధార్ నెంబరు అనుసంధానం చేసుకోవాలి. ఎల్పీజీ సబ్సిడీ నుంచి విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, వయోవృద్ధులకు పెన్షన్లు, పీపీఎఫ్, పొదుపు పథకాలు... ఇలా ఎక్కడైనా, ఎందులోనైనా ఆధార్ అనుసంధానం తప్పనిసరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles