Congress retains Nanded-Waghala civic body అక్కడ అధికార పార్టీపై అధిపత్యం విపక్షానిదే..

Ashok chavan s congress consolidates non bjp vote to sweep nanded

nanded-waghala municipal corporation elections, nanded-waghala elections, nanded polls, congress wins nanded polls, congress victory, Aditya thackeray, shivsena, BJP, Congress, NCP, MIM

The Congress wept the municipal polls in Maharashtra’s Nanded, defeating the ruling BJP in a keenly contested battle. While the Congress has been in power in the civic body for nearly two decades.

అక్కడ అధికార పార్టీపై అధిపత్యం విపక్షానిదే..

Posted: 10/13/2017 11:43 AM IST
Ashok chavan s congress consolidates non bjp vote to sweep nanded

మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కమలనాధులు విజయదుందుభి మ్రోగించిన వెనువెంటనే అదే అధికార బీజేపీ చుక్కలు చూపించింది విపక్షం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగరా మ్రోగిన వేళ, త్వరలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్డు విడుదల కానున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో తమ ఉనికిని, సత్తాను చాటేందుకు కాంగ్రెస్ నేతలకు కాసింత ఉత్సాహాన్ని అందించే విధంగా మహారాష్ట్రలోని ఎన్నికల ఫలితాలు ప్రస్పుటించాయి.

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో అధికార బీజేపి పార్టీ పెద్ద సంఖ్యలో సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకుని.. తమకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టువుందన్న విషయాన్ని నిరూపింతం చేసింది. మొత్తం 3.489 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, బీజేపీ 1,457 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 301తో రెండో స్థానంలో, శివసేన 222తో మూడో స్థానంలోనూ, ఎన్సీపీ 194 స్థానాలతో నాలుగో స్థానంలోనూ నిలిచాయి.

కాగా, అధికారంలో ఉన్న బీజేపీ, శివసేనలకు షాకిస్తూ, నాందేడ్ - వాఘాలా మునిసిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ ఘనవిజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో మొత్తం 54 స్థానాలకు గాను 49 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ 3 స్థానాల్లో, శివసేన ఒక స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి. అయితే ఈ ఎన్నికలలో ఎంఐఎంకు పెద్ద షాక్ తగిలింది. గత ఎన్నికలలో 11 కార్పోరేటర్లతో రాజకీయ పార్టీలో హావా చాటిన ఎంఐఎం.. ఈ ఎన్నికల ఫలితాలో మాత్రం తుడిచిపెట్టుకుపోయింది. బీజేపీపై ప్రజలకు ఆశలు ఎంతమాత్రమూ లేవని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashok chavan  nanded  municipal elections  shivsena  BJP  Congress  NCP  MIM  

Other Articles