real estate under GST next month మధ్యతరగతి ప్రజలారా.. త్వరపడండీ లేదా.. భారం తప్పదు..

Talks on getting real estate under gst next month arun jaitley

Arun Jaitley, finance, Jammu Kashmir, GST, Deloitte, Harvard University, Petroleum products, alcohol, Delhi, latest news

Arun Jaitley has decided to expand GST to the real estate sector, a move aimed at checking tax evasion in the sector known for cash-based transactions and lowering prices for flat buyers in the long-run.

మధ్యతరగతి ప్రజలారా.. త్వరపడండీ లేదా.. భారం తప్పదు..

Posted: 10/13/2017 10:18 AM IST
Talks on getting real estate under gst next month arun jaitley

మధ్యతరగతి ప్రజలారా.. త్వరపడండీ లేదా.. భారం తప్పదు.. ఇది పూర్తిగా నిజం. అయితే కేంద్రం తీసుకుంటున్న ఓ తాజా నిర్ణయం త్వరలోనే మద్యతరగతి ప్రజలపై భారాన్ని మోపనుంది. ఇది అమల్లోకి వస్తే ఇప్పటికిప్పుడు మాత్రం భారం పడతున్నా.. దీర్ఘకాలంలో మాత్రం ప్రయోజనాలు చేకూరునున్నాయని కేంద్రం భావిస్తుంది. అదేంటంటే త్వరలో రియల్ ఎస్టేట్‌ రంగాన్ని కూడా జీఎస్టీ కిందకు తీసుకురానున్నారు. ఈ మేరకు రానున్న జీఎస్టీ సమావేశంలో ఈ అంశమై కౌన్సిల్ లో చర్చ జరుగనుంది.

ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. హార్వర్డ్ యూనివర్శిటీలో మాట్లాడారు. ఇండియా చేపట్టిన పన్ను సంస్కరణలపై  అభిప్రాయాలను వినిపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో భారీ స్థాయిలో పన్ను ఎగవేత జరుగుతున్నదని.. త్వరలోనే ఆ రంగాన్ని కూడా జీఎస్టీ  కిందకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జీఎస్టీ  మండలి నిర్వహించే తర్వాత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. గౌహతిలో నవంబర్ 9వ తేదీన తర్వాత జీఎస్టీ  సమావేశాలు జరగనున్నాయి.

నగదు మార్పిడి ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్నదని… అక్కడే ఎక్కువ శాతం పన్ను కూడా ఎగవేస్తున్నారని, రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు జైట్లీ. రియల్‌ రంగాన్ని జీఎస్టీ కిందకు తీసుకురావాలని తాను కూడా గట్టిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.  వచ్చే నెలలో జరిగే జీఎస్టీ  సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు.. రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయని, అందుకే దానిపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ నిర్మాణాలపై 12 శాతం జీఎస్టీ వసూల్ చేస్తున్నారు. అయితే భూమి, స్థిరాస్తులపై మాత్రం జీఎస్టీ లేదు. నోట్లు రద్దు అనేది ప్రాథమిక సంస్కరణ అని…దేశాన్ని పన్ను ఎగవేత నుంచి ఆదుకునేందుకు తీసుకున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర అర్థిక మంత్రి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  finance  Jammu Kashmir  GST  Deloitte  Harvard University  Petroleum products  alcohol  Delhi  latest news  

Other Articles