Farmers Allegedly Forced By Cops To Strip After Protest In MP రైతన్నలపై విరిగిన లాఠీ.. విచారణకు అదేశం

Madhya pradesh cops accused of thrashing and making farmers strip down

farmers stripped, madhya pradesh, tikamgarh farmers, tikamgarh, shivraj singh chouhan, shivraj farmer, mp farmer conditions, mp congress, congress protest, farmer rally, kisan rally

The Madhya Pradesh government ordered an inquiry into allegations that police personnel made a group of farmers strip down to their underwear and beat them at Tikakgarh Rural Police Station.

రైతన్నలపై విరిగిన లాఠీ.. విచారణకు అదేశం

Posted: 10/04/2017 06:26 PM IST
Madhya pradesh cops accused of thrashing and making farmers strip down

తమ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కడం అన్ని రాష్ట్రాల్లో సాధరణంగా జరుగుతుంది. అయితే కడుపు కాలిపోతున్న క్రమంతో చేతికందాల్సిన పంటలు నీట మునుగుతున్నాయన్న భాదో.. లేక ఎరువులకు, పంటలు వేసేందుకు చేతిలో డబ్బులేదనో అన్నదాతలు ఆందోళనకు దిగడం మనకు తెలిసిందే. ప్రకృతి అనుకూలించాలి.. దానికి తోడు ప్రభుత్వాలు సకాలం సాయం అందిస్తే కానీ దేశంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయం లాభాలను అర్జించదు.

అయితే ఎక్కడ ఏ చిన్న పోరబాటు జరిగినా.. ఆ నష్టాన్ని రైతన్నలే భరించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు ఎంతోకొంత నష్టపరిహారాన్ని ప్రకటించినా.. అది చేతికందే సరికి ఎన్ని రోజులు పడుతుందో.. అ పరిహారం వారి అక్రందనలను దూరం చేస్తుందా..? లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఎరువాక సాగుతున్న క్రమంలో విత్తనాలు అందకో.. మొత్తానికి రైతన్నలు జిల్లా కలెక్టరు కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. నిరసన ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

అన్నం పెట్టే రైతన్నలపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ ఉపయోగించారు. అరెస్టు చేసిన రైతులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇలా ఒక్కరిని, ఇద్దరినీ కాదు.. ఏకంగా నలభై మంది రైతన్నలను స్టేషన్ కు తరలించిన పోలీసులు వారిపై అమానుషంగా వ్యవహరించారు. రైతులందరినీ బట్టలు విప్పించి చావచితకొట్టారు. స్టేషన్ లో మాత్రం జన్ సేవ అంటూ బోర్డులు పెట్టుకున్న పోలీసులు.. ఆ జనంలో వున్న రైతులపై లాఠీలు జుళిపించారు. అర్థనగ్నంగా నిలబెట్టి స్టేషన్ లోనే దారుణంగా అవమానించారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని తికాంగఢ్ జిల్లా కలెక్టరేట్ వద్ద చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ రోడ్డెక్కిన దేశానికే వెన్నుముక్కగా నిలిచిన రైతన్న.. వెన్నుపైనే లాఠీలతో చితకబాదారు. తమ డిమాండ్లను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అనుమతించలేదు. దీంతో కోపోద్రిక్తులైన రైతులు పోలీసులపై తిరగబడ్డారు. దీంతో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జి చేశారు. 40 మంది రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు.

పోలీసుల లాఠీచార్జి లో 30 మంది రైతులు గాయపడ్డారని.. రైతులకు మద్దతుగా నిలిచిన స్థానిక ప్రతిపక్ష కాంగ్రెస్ నేత యద్వేంద్ర సింగ్ తెలిపారు. ఈ విషయంపై జాతీయ మానవహక్కుల కమీషన్తో పాటు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు యద్వేంద్ర తెలిపారు. లాఠీ చార్జీ చేసి అందోళన దిగిన రైతన్నలను చెదరగొట్టడం చేయాల్సిన పోలీసులు.. వారిని టార్గెట్ గా ఎంచుకుని పట్టుకుని స్టేషన్ కు తీసుకెళ్లి మరీ వారిని సంఘవిద్రోహ శక్తుల మాదిరిగా అర్థనగ్నంగా నిల్చోబెట్టి చితకబాదడం ఏంటని యద్వేంద్ర ప్రశ్నించారు. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం రైతుల ఘటనపై విచారణకు అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmers  stripped  kisan rally  tikamgarh  shivraj singh chouhan  congress  madhya pradesh  

Other Articles