Madras HC continues stay in MLA disqualification case విప్ ధిక్కరించినవారిపై ఏవీ చర్యలు.. హైకోర్టు ప్రశ్న

Hc sends notice to tn speaker asking why he didn t act against ops

dhanpal, MLAs disqualification, Madras High Court, notice, ECI, Dhinakaran, AIADMK, Jayalalithaa, palinisamy, pannerselvam, tamilnadu politics

The Madras High Court issued notice to TN Assembly Speaker as to why no action was taken against 12 MLAs including Deputy CM O Panneerselvam who had defied the whip on a confidence motion.

విప్ ధిక్కరించినవారిపై ఏవీ చర్యలు.. హైకోర్టు ప్రశ్న

Posted: 10/04/2017 05:28 PM IST
Hc sends notice to tn speaker asking why he didn t act against ops

తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధన్ పాల్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణపై స్టేను విధించింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు తమ స్టే కోనసాగుతుందని అదేశించింది. దీంతో దినకరణ్ వర్గ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో పాటు వారి నియోజకవర్గాలలో ఉపఎన్నికలు నిర్వహించరాదని కూడా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ రవిచంద్రబాబు.. పళినిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తెలిపిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

దినకరణ్ వర్గం కన్నా ముందుగా విఫ్ ధిక్కరించి పార్టీ నిర్ణయానికి, ప్రభుత్వ వ్యతిరేకతకు పాల్పడిన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. కేవలం దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలనే ఎందుకు అనర్హులుగా ప్రకటించారని నిలదీశారు. తమను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శశికళ వర్గం ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు బుధవారం (అక్టోబర్4) విచారణ జరిపింది. డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వంతో పాటు ఆయన వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డీఎంకే వేసిన పిటిషన్‌పై కూడా కోర్టు వాదనలను విన్నది.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు ప్రయత్నించారని.. అందుకే 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారని స్పీకర్‌ తరపు లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. అయితే స్పీకర్‌ చర్య రాజ్యాంగ విరుద్ధమని.. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సీఎంకు మాత్రమే మద్దతు ఉపసంహరించారని, పార్టీకి కాదని దినకరన్‌ తరపు న్యాయవాది అభిషేక్‌ మాను సింఘ్వి తెలిపారు. ఫిబ్రవరిలో సీఎం ఎడపాడి పళనిస్వామి బలపరీక్ష జరిగినప్పుడు అసెంబ్లీలో పన్నీర్‌ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించినా చర్యలు తీసుకోలేదని.. వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. DMK పిటిషన్‌పై ఈ నెల 12లోగా సమాధానం ఇవ్వాలని స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించింది.  కోర్టు తీర్పుతో దినకరన్ వర్గానికి కొంత ఊరట దక్కినట్లయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhanpal  MLAs disqualification  Madras High Court  notice  ECI  Dhinakaran  AIADMK  

Other Articles