ప్రపంచ అతిపెద్ద బ్యాంకుల జాబితాలో చేని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులకు దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభవార్త అందించింది. బేస్ రేటులో 5 బేసిస్ పాయింట్ల మేర కోతపెట్టింది. ప్రస్తుతం 9శాతంగా ఉన్న బేస్ రేటు తాజా తగ్గింపుతో 8.95 శాతానికి చేరింది. అయితే ఎస్బీఐ నిర్ణయంతో ఏప్రిల్ 2016కు ముందు గృహ రుణం పోందిన లబ్ధి చేకూరనుంది. ఈ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుందని ఎస్బీఐ ప్రకటించింది. అయితే ఎంసీఎల్ఆర్ రేటు ఎలాంటి మార్పులేదు.
ఐసిఐసీఐ సహా యాక్సిస్ బ్యాంకులు కొత్తగా తమ వద్ద గృహ రుణం తీసుకునే ఖాతాదారులకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఎస్బీఐ మాత్రం బేస్ రేటును కటాప్ చేసి తమ వద్ద రుణం తీసుకున్న రుణదాతలకు లబ్ది చేకేర్చనుంది. అక్టోబర్ నెలలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో ఎస్బీఐ చర్యకు ప్రాధాన్యత ఏర్పడినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రివ్యూలో బేస్ రేటులో కోత పెడుతుందనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి.
అయితే మైక్రో ఎకానమిక్ డాటా ఆధారంగా రేట్ ఉండకపోవచ్చని ఎస్బీఐ అభిప్రాయపడింది. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంకు బేస్ రేటులో కోతలను అమలు చేశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా బేస్ రేటును 35 బేసిస్ పాయింట్ల మేర కుదించి 9.15 శాతానికి తగ్గించింది. ఈ బాటలో ఆంధ్రా బ్యాంకు సైతం 15 బేసిస్ పాయింట్లు తగ్గించి బేస్ రేటును 9.55 శాతంగా ప్రకటించింది. బ్యాంకులు బేస్ రేటు ఆధారంగా రుణాల మంజూరీని చేపట్టే విషయం విదితమే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more