Self-Proclaimed Godman Arrested For Allegedly Raping Woman మరో బాబా బండారం బట్టబయలు.. దళిత యువతిపై..

Self proclaimed godman arrested for allegedly raping woman

Baba Siyaram Das, self-proclaimed godman, Woman raped by baba, dalit woman, sexual assault, molestation, harrassement, crime on woman, rintoo singh, law collage, receptionist, dashrath, ashish shukla, misrikh, uttar pradesh, crime

A self-proclaimed godman was arrested for allegedly raping a Dalit woman in the Misrikh area of Sitapur district, police said today.

మరో బాబా బండారం బట్టబయలు.. దళిత యువతిపై..

Posted: 09/29/2017 12:58 PM IST
Self proclaimed godman arrested for allegedly raping woman

సాధువుల ముసుగులో సంసార వాంఛను తీర్చుకుంటూ పైకి మాత్రం మాయమాటలు, నీతి సూక్తులు చెబుతూ ప్రజలను తన అదుపాజ్ఞల్లో వుండేట్లు చేసుకుంటూ చేయకూడని పనులు చేస్తూ అడ్డంగా బుక్కవుతున్న దొంగ బాబాల గుట్టు క్రమక్రమంగా బటబయలు అవుతూనే వుంది. హర్యానాలో డేరా బాబా అకృత్యాలు బయటపడిన వెంటనే పలహార బాబా అఘాయిత్యాలు వెలుగుచూశాయి. అయన అరెస్టైయిన తరువాత తాజాగా మరో దోంగ సాధువు వేషం వెనుక సాగించిన నీచపు పనులు కూడా వెలుగుచూశాయి.

తానే దేవుడని ప్రకటించుకొని ఆశ్రమం నడుపుతున్న ఉత్తరప్రదేశ్ లోని ఓ దొంగబాబా తన ఆశ్రమంలోనే ఓ 19 ఏళ్ల దళిత యువతిపై గత 8 నెలలుగా సాగించిన అత్యాచార ఉదంతం తాజాగా వెలుగు చూసింది.   బాధిత దళిత యువతి పోలీసు కంట్రోలురూంకు ఫోన్ చేసి బాబా అత్యాచార ఉదంతంపై ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు బాబా అశ్రమంపై దాడులు నిర్వహించి బాధిత యువతని బాబా కబంధ హస్తాలనుంచి విముక్తి కల్పించారు. అశ్రమంలో సేద తీరుతున్ బాబా సియారం దాస్ ను అరెస్టు చేశారు.

బాబా నిర్వహిస్తున్న లా కళాశాలలో ఉద్యోగం కోసం వచ్చిన దళిత యువతిని రింటూ సింగ్ అనే మేనేజరు.. తనను మిస్ర్తీఖ్ పట్టణంలో వున్న బాబా ఆశ్రమానికి తీసుకువచ్చాడని.. ఇక్కడకు చేరుకోగా బాబా తనపై అత్యాచారం చేశాడని, విషయాన్ని బయటకు చెప్పద్దని హెచ్చరికలు చేశాడని బాదితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా దశరథ్, ఆశిష్ శుక్లాలనే ఇద్దరు వ్యక్తులు యువతిని యాభైవేల రూపాయలకు తమకు విక్రయించారని రింటూ సింగ్ పోలీసులకు చెప్పాడు. యువతి ఫిర్యాదుతో ఆశ్రమంలో బాబా సాగించిన అత్యాచార బాగోతం బట్టబయలైంది. ఈ కేసులో బాబాకు సహకరించిన దశరథ్, శుక్లా, రింటూ సింగ్ ల కోసం గాలిస్తున్నామని సీతాపూర్ ఎస్పీ మృగేంద్రప్రతాప్ సింగ్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Siyaram Das  self-proclaimed godman  Woman raped by baba  misrikh  uttar pradesh  crime  

Other Articles