godess durga as mahishasuramardini సూర్యనారాయణుడిగా శ్రీవారు.. మహిషాసురమర్దినిగా అమ్మవారు..

Tirumala srivaru on surya prabha vahanam godess durga as mahishasuramardini

Tirumala bramosthavam, srivari bramosthavalu, Lord Malayappa Swamy, Sri Ramachandra Murthy, Lord surya praba vahanam, vijayawada, kanakadurgamma temple, mahishasuramardini, latest news

In the on going bramosthavam tirumala srivaru taken out in procession atop Lord surya prabha vahanam, and at vijayawada godess durga today blessed devotees in mahishasuramardini alankarana.

సూర్యనారాయణుడిగా శ్రీవారు.. మహిషాసురమర్దినిగా అమ్మవారు..

Posted: 09/29/2017 11:25 AM IST
Tirumala srivaru on surya prabha vahanam godess durga as mahishasuramardini

తిరుమలలో కలియుడ ప్రత్యక్షదైవం శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడికి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ మలయప్ప స్వామి సూర్యనారాయణుడిగా భక్తులకు అభయప్రధానం చేశారు. ఇవాళ ఉదయం వెంకటేశ్వర స్వామి.. సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. వజ్ర కవచం ధరించి ఉదయం సూర్యకిరణాలు ప్రసరిస్తుండగా నాలుగు మాడ వీధుల్లో సూర్య మండలం మధ్యనున్న నారాయణమూర్తిని నేనేనని భక్తులకు బోధిస్తూ స్వామివారు దర్శనవివ్వగా, భక్తకోటి గోవింద నామస్మరణతో తిరుమల క్షేత్రం ప్రతిధ్వనించింది.

ఇక దసరా సందర్బంగా దేవి నవరాత్రులను పురస్కరించుకుని ఇటు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయంపై కూడా భక్తకోటి అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. నవరాత్రి వేడుకలలో భాగంగా మహర్నవమిని పురస్కరించుకుని ఇవాళ అమ్మామారు మహిషాసురమర్థిని అలంకరణలో భక్తులను అశీర్వదించారు. వేకువ జామునుందే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

ఘనంగా అయుధ పూజ

సకల దేవతల అంశలను గ్రహించి, వారిచ్చిన ఆయుధాలను, అలంకారాలను ధరించి స్త్రీలను చులకనగాచూసి దున్నపోతు మనస్తత్వం మూర్తీభవించిన మహిషాసురుణ్ని సంహరించిన అమ్మవారిని పూజిస్తే శ్రతుభయం వుండదని భక్తుల విశ్వాసం. ఇక ఇవాళ సకల దేవతల అయుధాలను ధరించి అమ్మవారు విజయంతో తిరిగిరావడంతో.. అయుధ పూజను కూడా భక్తులు అనాధిగా నిర్వహిస్తుంటారు. అన్ని వృత్తుల వారు ఇవాళ తమ అయుధాలను పూజించి.. విజయం సాధించాలని కోరుతూ అమ్మవారిని పూజిస్తారు.

దేశంలోని అన్ని కర్మాగారాలు, పరిశ్రమలలో అయుద పూజ ఘనంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఇటు ప్రైవేటు పరిశ్రమలలో కూడా అయుధపూజలు నిర్వహిస్తున్నారు. భారీ యంత్రపరికరాలే ఆయుధాలుగా భావించే కార్మికులు ఇవాళ అమ్మవారిని పూజించి ఘనంగా పరిశ్రమలలో వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక ఇటు చిన్న పరిశ్రమలలో కూడా యంత్రపూజ ఘనంగా జరిగింది. ఇక వాహనాలనే అయుధాలుగా పూజించే లారీ, బస్సులు, క్యాబ్ ఇలా అన్ని రంగాల వారు అమ్మవారి అలయాలకు తరలివెళ్లి తమ వాహనాలకు పూజలు నిర్వహించి అమ్మవారి అశీర్వాదం పోందరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles