Rain plays spoilsport with TS shot at Guinness record సద్దుల బతుకమ్మ గిన్నీస్ రికార్డు విఫలం

Saddula bathukamma guinness history run stopped by showers

Saddula Bathukamma, Guinness Book of World Records, flower arrangement, bursting firecrackers, Bathukamma Ghat,bathukamma, chandrashekar rao, Telangana CM, cultural department, Guinness Record, floral festival latest news

Heavy rains played spoilsport for the thousands of women who had converged in the city, from various parts of Telangana, on Thursday to participate in the Saddula Bathukamma festivities.

సద్దుల బతుకమ్మ గిన్నీస్ రికార్డు విఫలం

Posted: 09/29/2017 09:42 AM IST
Saddula bathukamma guinness history run stopped by showers

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సద్దుల బతుకమ్మ పర్వదినాన ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలు అశించిన స్థాయిలో అకట్టుకోలేకపోయాయి. ఈ వేడుకల ద్వారా గిన్నిస్‌ బుక్ లో స్థానం సంపాదించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. మూడు వేల మంది మహిళలతో రాష్ట్ర చిహ్నమైన మహా తంగేడు పువ్వు ఆకృతి రూపొందించి.. తద్వారా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కాలని చేసిన ప్రయత్నం సఫలం కాలేదు.

ఇలాంటి ఈవెంట్ లకు ముందస్తు రిహార్సల్ చేయాల్సిన అవసరం వున్నా దానిని పరిగణలోకి తీసుకోని సంస్కాృతిక శాఖ.. నేరుగా మహిళలను రంగంలో దింపడంతో అయోమయానికి గురైన వారు తలోవిధంగా అడేసరికి గిన్నిస్ బుక్ ఫీట్ సాధ్యంకాలేదు. ఇక మూడు వేల మంది మహిళల వస్తారని ముందుగానే ప్రకటించిన ప్రభుత్వం అంతమందిని వేదిక వద్దకు తరలించడంలోనూ విఫలమైంది. సరిపడా సంఖ్యలో మహిళలు లేకపోవడంతో ఈ ప్రయత్నం బెడిసికొట్టింది.

తంగేడు పువ్వు ఆకృతిలో నిలబడలేక కొందరు మహిళలు సొమ్మసిల్లిపోయారు. గిన్నిస్‌ ప్రతినిధులు 2 అవకాశాలు కల్పించినా ప్రకృతి అనుకూలించలేదు మరోవైపు వరుణుడు కూడా ఈ ఫీటుకు ఆటంకంగా నిలిచాడు. రెండు పర్యాయాలు వర్షం కురిసి సున్నపు గళ్లను చెరగిపోవడంతో ఏర్పాట్లకే సమయం అధికంగా తీసుకుంది. దీంతో గిన్నీస్ ఫీటుకు అస్కారం లేకుండా పోయింది.

మహిళలతో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మరోమారు విద్యార్థినులతో మహా బతుకమ్మ ఫీట్ చేయాలని భావిస్తోంది. తంగేడు పువ్వు కాకుండా మరో పువ్వును ఎంపిక చేసి విద్యా సంస్థలతో కలసి ప్రయత్నించేందుకు సిద్ధమవుతోంది. గిన్నిస్‌ ప్రతినిధి మరోసారి అవకాశం ఇస్తామని పేర్కొనడంతో రెండు మూడు నెలల్లో తిరిగి ప్రయత్నించాలని సాంస్కృతిక శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles