Telanaga Dussera 2017 Holidays Hyderabad Empty | హైదరాబాద్ ఖాళీ అయ్యింది.. రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలే

Telangana dussera holidays people vacate city

Telangana, Dussera 2017, Holidays, Hyderabad, Bathukamma Ceebrations, Tank Bund, Traffic Diversion

Telangana People Vacate Huderabad due to Dussera Holidays. Already Educational institutions decared holidays now its banks and Government Offices due to Gandhi Jayanthi and Moharram.

వరుస సెలవులు.. ట్రాఫిక్ ఆంక్షలు...

Posted: 09/28/2017 06:48 AM IST
Telangana dussera holidays people vacate city

తెలంగాణ రాష్ట్రంలో వరస సెలవుల నేపథ్యంలో ప్రజలు తమ సొంత ఊళ్లకు క్యూ కట్టారు. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించా.. నేటి నుంచి వరుసగా గవర్నమెంట్ కార్యాలయాలు ఐదు రోజుల మూతపడనున్నాయి. గురువారం బతుకమ్మ, దుర్గాష్టమి, 29న మహానవమి (ఐచ్ఛిక సెలవు) 30న దసరా, 1న మొహర్రం, 2న గాంధీ జయంతి.. ఇలా సెలవులు వచ్చాయి.

ఇక తెలంగాణ సంస్కృతిని ప్ర‌తిబింబింప‌జేసే బతుకమ్మ సంబురాలు రేప‌టితో ముగియ‌నున్నాయి. చివ‌రిరోజున నిర్వ‌హించే స‌ద్దుల బ‌తుక‌మ్మను హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌బండ్‌పైన ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయ‌ని హైద‌రాబాద్‌ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

ట్రాఫిక్ మళ్లీంపు రూట్లు...

కింగ్ కోఠి నుంచి వచ్చే వాహనాలను కింగ్ కోఠి ఎక్స్ రోడ్ మీదుగా అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ నుంచి దారి మళ్లిస్తున్న‌ట్లు చెప్పారు.

సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ కు వచ్చే వాహనాలు కర్బలా మైదాన్, బైబిల్ హౌజ్, కవాడి గూడ, లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చేలా దారి మళ్లిస్తారు.

హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపున‌కు వెళ్లాల్సి ఉంటుంది.

పంజాగుట్ట, రాజ్ భవన్ రోడ్ ద్వారా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం వరకు మాత్రమే అనుమతిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles