ప్రపంచమంతా విస్తూ పోయే స్థాయిలో మయన్మార్‌లో హిందూలపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నీమధ్యే 20 మందికిపైగా సమాధి చేసిన ఘటన వెలుగు చూడగా, మరో వారంలోనే ఇంకో దారుణ ఘటన బయటపడింది. ఉత్తర రఖైన్‌లోని ఖామౌంగ్ షేక్ అనే గ్రామంలో 45 మంది హిందువుల మృతదేహాలను వెలికి తీసిన సైన్యం అదృశ్యమైన మరో 48 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
గత నెల 25న ఆర్కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అనే ముస్లిం తీవ్రవాద సంస్థ పిల్ల, పెద్ద, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా హిందువులను గుంపులుగా నిలబెట్టి గొంతు కోసం హత్య చేసింది. అనంతరం అందరినీ ఒకేచోట పూడ్చిపెట్టారు. ‘జాతి శుద్ధి’ పేరుతో రెండు నెలల క్రితం సైనిక చర్య మొదలైన తర్వాత తొలిసారి సైన్యం మీడియాను వెంటపెట్టుకుని ఊచకోత జరిగిన ప్రాంతాలకు తీసుకెళ్లి వారి అరాచకాలను చూపించింది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా హతమార్చింది.
ఇప్పుడు మౌంగ్ షేక్ గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీరు కట్టలు తెంచుకుంటోంది. ముసుగులు ధరించిన కొందరు దుండగులు తమపై దాడిచేసి తమ కళ్లముందే తమవారిని చంపేశారని చెబుతున్నారు. తన కళ్ల ముందే భర్త, ఇద్దరు సోదరులు, గ్రామస్థులను చంపేశారని గ్రామానికి చెందిన రీకాధర్ కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. తన భర్తతోపాటు వందమందిని కొండల్లోకి తీసుకెళ్లి చంపేశారని మరో మహిళ ప్రమీల తెలిపింది.
గత ఏడాది కాలంగా ముస్లిం తీవ్రవాదుల చేతుల్లో 163 మంది చనిపోగా, 91 మంది గల్లంతయ్యారని మయన్మార్ సైన్యం తెలిపింది. కాగా, ఆత్మీయులను కోల్పోయిన 5 లక్షల మందికి పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చారు. హిందువులను ఊచకోత కోసి గోతుల్లో పూడ్చిపెట్టిన మృతదేహాలను మయన్మార్ సైన్యం వారం రోజులుగా వెలికి తీస్తోంది. తమవారిని విగతజీవులుగా చూస్తున్న కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. వారిని ఊరడించడం ఎవరి తరమూ కావడం లేదు. ఇదిలా ఉంటే శ్రీలంకలోని రోహింగ్యాలపై బౌద్ధులు దాడులకు దిగుతున్నారు. కొలంబోలో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న శిబిరం వద్ద బౌద్ధులు ఆందోళనకు దిగారు.
(And get your daily news straight to your inbox)
Feb 25 | కరోనా మహమ్మారి మానవాళిపై సృష్టించిన కష్టకాలాన్ని పక్కనబెడితే.. దాని పేరుతో ఇప్పుడు దేశంలో ధరఘాతం మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఇంధన ధరలు సెంచరీ మార్కుకు చేరుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే... Read more
Feb 25 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లోని ప్రజల ధనంతో ఆర్థిక నేరానికి పాల్పడి.. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూనైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ కోర్టు షాకిచ్చింది. గత రెండున్నరేళ్లుగా... Read more
Feb 25 | కార్మికుల సమస్యల పరిష్కారించేందుకు, వారి సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగాల్పిన కార్మిక నేత దారి తప్పాడు. కార్మిక నేత హోదాలో తోటి కార్మికుడికి తానే సమస్యగా మారాడు. తన కాలనీలోనే నివాసం ఉంటున్న మరో... Read more
Feb 25 | అమ్మాయిల కాలేజీకి వద్ద కోతుల బ్యాచ్ తిష్ట వేసింది. ఉదయం, సాయంకాలలతో పాటు రాత్రి వేళ్లలోనూ అక్కడే అవాసాన్ని ఏర్పాటు చేసుకుని కాలేజీ విద్యార్థినులతో పాటు ఉపాద్యాయులను కూడా వేధిస్తున్నాయి. ఈ కోతుల బ్యాచ్... Read more
Feb 25 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఎన్నికలను జరగనున్న కేరళ రాష్ట్రంలో పర్యటిస్తూ.. అక్కడి కొల్లాం జిల్లాలోని మత్య్సకారుల సమస్యలను తెలుసుకునేందుకు వారితో కలసి సముద్రయానం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు సముద్రంలో... Read more