Mangalyaan completes three years in Mars Orbit జైత్రయాత్ర కోనసాగిస్తున్న మంగళయానం

Made to run only for six months india s mangalyaan still going strong

science news, mangalyaan, mars orbiter, mars orbit, ISRO, India's Mars mission, MOM, Mars Orbiter Mission, latest news

India’s Mass Orbiter Mission Mangalyaan, completed three years in the orbit of the red planet. The satellite entered into mars Orbit in September 2014 with only 40 kg of fuel.

జైత్రయాత్ర కొనసాగిస్తున్న మంగళయానం

Posted: 09/26/2017 09:35 AM IST
Made to run only for six months india s mangalyaan still going strong

భారతీయ శాస్త్రవేతల నైపుణ్యం.. వారి తేజోవంతమైన మేదస్సును కొనియాడాల్సిన అవసరం వుంది. 2013 నవంబర్ 5న భారత దేశం అంగారకుడిపైకి వ్యోమనౌకను పంపేందుకు సన్నధమైన క్రమంలో పలు దేశాలు ముక్కున వేలేసుకున్నాయి. విఫలయత్నం కాక తప్పదన్న వార్తలు వచ్చినా.. వెనక్కు తగ్గిన ఇస్రో శాస్త్రవేత్తలు.. అత్యంత చౌకధరతో దానిని ప్రయోగించి.. సఫలీకృతమయ్యారు. అరు నెలల పాటు పనిచేస్తే చాలునని భావించి ప్రయోగించిన ఈ వ్యోమనౌక అంగారక కక్షలోకి వెళ్లి ఏకంగా మూడేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుని దిగ్విజయంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తుంది.

మంగళయాన్‌ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం అనంతరం ఆ వ్యోమనౌక.. 2014 సెప్టెంబర్‌ 24న విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. తద్వారా మొదటి ప్రయత్నంలోనే ఆ గ్రహం వద్దకు చేరుకున్న తొలి దేశంగా భారత్‌ ఘనత సాధించింది. కేవలం రూ.450 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టడం విశేషం.

అంగారకుడిపై ఉన్న ఖనిజాల నిల్వలను, జీవజాలం ఉనికికి ఆధారంగా భావిస్తున్న మీథేన్‌ వాయువు ఆనవాళ్లను పట్టుకోవడం వంటి లక్ష్యాలను దీనికి నిర్దేశించారు. ఇందులో ఐదు సైన్స్‌ పరికరాలను అమర్చారు. అందులోని మార్స్‌ కలర్‌ కెమెరా (ఎంసీసీ) ద్వారా 715 ఫొటోలను తీశారు. ఈ వ్యోమనౌకలో అనేక సంవత్సరాలకు సరిపడా ఇంధనం ఉందని 2015 జూన్‌లో ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. మంగళయాన్‌ మూడేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో 2014 సెప్టెంబర్‌ 24 నుంచి గత ఏడాది సెప్టెంబర్‌ 23 వరకూ అది సేకరించిన డేటాను ఇస్రో విడుదల చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : science news  mangalyaan  mars orbiter  mars orbit  ISRO  

Other Articles