UAE airline offers 'fly now, pay later' plan విమానం టిక్కెట్ కూడా వాయిదా పద్దతిలోనే..

Etihad airways launches fly now pay later scheme

Saudi Arabia, Payfort, fly now pay later, Etihad airways, Dubai, Aviation, UAE airlines, instalments, Pay by Instalment, credit card

The UAE's flag carrier Etihad Airways has launched a 'fly now and pay later' scheme which provides people an option of paying the ticket fare in monthly instalments, the airline said.

తెలుసా.. విమానం టిక్కెట్ కూడా వాయిదా పద్దతిలోనే..

Posted: 09/23/2017 05:56 PM IST
Etihad airways launches fly now pay later scheme

మనిషి సాంకేతికంగా ఎంత ఎత్తు ఎదిగినా.. నగరికత ఎంత ఎదిగినా.. మద్య, దిగువ మద్య కుటుంబాలకు ఆ సాంకేతికత అందడం మాత్రం దూరపుమాటే. వీరిని కూడా తమ ఖాతాలో చేర్చుకోవడానికి వ్యాపార, వాణిజ్య సంస్థలు ఎన్నో పథకాలను రచిస్తుంటాయి. వాటిలో ఒకటి వాయిదాల పద్దతి. ఈ పద్దతి నచ్చిన, మెచ్చిన మధ్య, దిగువ సంస్థలు అకర్షితులైయ్యాయి. వ్యాపారుల అంచాలను అందుకున్నాయి. ఇంకేముందు ఇది సక్సెస్ అయ్యింది.

దీంతో సరిగ్గా ఇలాంటి పద్దనినే ఏకంగా విమానయానఇంట‌ర్నెట్ యుగంలోనూ దిగువ‌ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు విమాన ప్రయాణం అంద‌ని ద్రాక్ష‌గానే మారింది. ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు ఎన్ని ఆఫ‌ర్లు పెట్టిన‌ప్ప‌టికీ దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌ను ఆక‌ర్షించడంలో పెద్ద‌గా విజ‌యం సాధించలేక‌పోతున్నాయి. కానీ వారిని ఆక‌ర్షించ‌డ‌మే ధ్యేయంగా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌కు చెందిన ఇతిహాద్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ వినూత్న ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెట్టింది.

`ఫ్లై నౌ అండ్ పే లేట‌ర్` పేరిట‌  విమాన టికెట్ డ‌బ్బును వాయిదాల ప‌ద్ధ‌తిలో చెల్లించే అవ‌కాశాన్ని క‌ల్పించింది. దీని ద్వారా టికెట్ డ‌బ్బును 3 నుంచి 60 నెల‌ల వాయిదాల్లో చెల్లించుకునే స‌దుపాయం క‌ల్పించింది. ఇందుకోసం టికెట్ బుక్ చేసుకునేట‌పుడు ‘పే బై ఇన్‌స్టాల్‌మెంట్‌’ ఆప్షన్‌ను ఎంచుకుని క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. విమాన ప్రయాణాన్ని మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావడానికే ఈ ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఇతిహాద్‌ ఎయిర్‌లైన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జస్టిన్‌ వార్బీ తెలిపారు. ప్రసుత్తం ఈ ఆఫర్‌ యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్టు ప్రజలకు మాత్రమే వర్తించ‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saudi Arabia  Payfort  fly now pay later  Etihad airways  Dubai  Aviation  

Other Articles