police arrest alwar godman in rape case ఎట్టకేలకు కటకటాల వెనక్కి కీచక సాధువు

Rajasthan godman arrested for sexually exploiting girl in alwar

Sant Kaushlendra Falahari Maharaj, 21-year-old Chhattisgarh girl, Jaipur police, Jaipur crime, Gurmeet Ram Rahim, Arvali Vihar Police Station, Bilaspur police station, Alwar godman, crime

A famous self-styled 'godman' of Alwar, Sant Kaushlendra Falahari Maharaj arrested in rape case after 21-year-old girl from Chhattisgarh has lodged a complaint against him in sexual assault case.

ఎట్టకేలకు కటకటాల వెనక్కి కీచక సాధువు

Posted: 09/23/2017 05:05 PM IST
Rajasthan godman arrested for sexually exploiting girl in alwar

యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఫలహారి బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. విరాళం ఇచ్చేందుకు వచ్చిన తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై 376, 506 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ ప్రకాష్ తెలిపారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫలాహారీ బాబాను విచారించేందుకు వెళ్లగా.. ఆయన అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బాబాను అల్వార్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. బాబా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండటంతో అతడిని అరెస్టు చేశారు.

కేవలం పండ్లను మాత్రమే తినే కౌశలేంద్ర ప్రపన్నాచార్య ఫలహారి(70) మహారాజ్ గా రాజస్థాన్ లో చాలా ప్రఖ్యాతి పోందారు. ఆయన స్థానిక భక్తులను మాత్రమే అశీర్వదించడం పక్కన బెడితే.. ఆయన భక్తుల జాబితాలో దేశ, విదేశాలకు చెందిన అనేక మంది భక్తులు కూడా వున్నారు. ఈయన భక్తుల జాబితాలో ఏకంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా వున్నారంటే ఆయన స్థాయి ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. ఇలాంటి ఫలహారీ బాబాపై ఓ యువతి తన పై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాబాను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఏడాది ఆగస్టు ఏడో తేదిన తన గదికి పిలిపించుకున్న బాబా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. గత పదిహేనేళ్లుగా తమ కుటుంబ సభ్యులు ఫలహారి బాబాకు భక్తులుగా ఉన్నామని..  బాబాకు విరాళం ఇవ్వడానికి వచ్చినప్పుడే ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపింది. దీంతో ఆమెను బాబా ఆశ్రమానికి తీసుకొచ్చిన పోలీసులు ఏ గదిలో ఈ ఘటన జరిగిందనే అంశంపై విచారణ చేపట్టారు. ఇ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles