Women Are 'Quarter Brained', Shouldn't Drive, Says Saudi Cleric మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వోదంట.. ఎందుకో..?

Women are quarter brained shouldn t drive says saudi cleric

saudi, saudi arabia, king salman, riyadh, yemen, iran, sunni, king abdullah, middle east, gulf, saudi king, king, women, controvrsial statments, saudi arabia, Driving, Women Driving, women quarter brain, women driving in saudi, half brain, Sheikh Saad Al-Hijri, Asir

A Saudi preacher has been banned from all religious activities after saying that women should not be allowed to drive because they have a quarter the brain of men.

మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వోదంట.. ఎందుకో..?

Posted: 09/23/2017 03:04 PM IST
Women are quarter brained shouldn t drive says saudi cleric

ఆకాశంలో సగం అంటూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు తమకు కూడా కల్పించాలని ఓ వైపు మహిళామణులు సన్నధమవుతున్న నేపథ్యంలో అసలు మహిళలకు డ్రైవింగ్ లైసెన్సలలే జారీ చేయవద్దని వివాదాస్పద వ్యాక్యలు చేశారు ఓ మతపెద్ద. అయితే ఇది మన దేశంలో కాదు కాబట్టి పెద్ద సంచలనం కాలేదని అంటారా..? ఇలా అదేశాలు జారీ చేసింది ఏకంగా మస్లిం దేశమైన సౌదీ అరేబియాలో.

దేశం ఏదైనా వివాదాదస్పద వ్యాక్యలు చేసిన తరువాత కచ్చితంగా దుమారం రేగడం సర్వసాధారణం. మత పెద్ద ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న సమచారం యావత్ ప్రపంచంలోనే వైరల్ గా మారిగా. అయనపై నిషేధాన్ని విధించారు. ఇదంతా సరే కానీ అసలు మత పెద్ద చేసిన వ్యాక్యల్లో వివాదాస్పదం ఏముంది..? అసలెందుకు ఆయన మహిళలకు డ్రైవింగ్ లైసెన్నులు ఇవ్వకూడదని అన్నారు. అంటున్నారా..?

పురుషులతో పోలిస్తే మహిళలకు 'పావుశాతం' మెదడు మాత్రమే ఉంటుందని, వాహనాలు నడిపేందుకు వారిని అనుమతించొద్దని సౌదీ అరేబియా మత పెద్ద ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు. మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ నిరాకరించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగడంతో సౌదీ ప్రభుత్వం సదరు మతపెద్దపై వేటు వేయక తప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రార్థనలకు నేతృత్వం వహించడం సహా ఇతర మతకార్యక్రమాలేవీ చేపట్టకుండా ఆయనపై సస్పెన్షన్ విధించింది.

సాద్ హిజ్రీ అనే మతపెద్ద  మాట్లాడుతూ.. పురుషులతో పోలిస్తే మహిళలకు 'సగం మెదడు' మాత్రమే ఉంటుందని, షాపింగ్ కు వెళ్లినప్పుడు అది పావుశాతానికి కుదించుకుపోతుందని, కాబట్టి వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మతవాద దేశమైన సౌదీ అరేబియాలో మహిళలపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. మహిళలు వాహనాలు నడుపడం ఇక్కడ అనుమతించరు. అయితే , మహిళ ఉద్యోగితను పెంచేందుకు ఇటీవల సౌదీలో సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saudi arabia  Driving  Women  quarter brain  half brain  Sheikh Saad Al-Hijri  Asir  saudi  

Other Articles