Russian Helicopter Fires on Spectators at Drills

Zapad war games russian military helicopter fires rocket at spectators

Russian military,war games,training ground,Russian military helicopter,Russian military column,Russian tanks,Russian President,cruise missiles,military manoeuvres,caused concern,Military officials,Helicopters fire,undisclosed location,mock target,unannounced Russian activity,advanced cruise missiles,Asian nation,precision strike capability,missile forces,military drills

CHILLING footage has emerged of the moment a Russian military helicopter gunship ‘accidentally’ fired a rocket on bystanders during war games in Russia.

ITEMVIDEOS: పొరబాటేనా.. ఇది.. వీక్షకులపైకి రాకెట్లు వదిలన యుద్ద ఛాఫర్లు

Posted: 09/20/2017 02:43 PM IST
Zapad war games russian military helicopter fires rocket at spectators

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు యుద్దసమరానికి సన్నదమవుతున్నాయా..? లేక యుద్దం అనివార్యమని భావిస్తున్నాయా..? వినాశకారిణియైన మూడో ప్రపంచ యుద్దం వచ్చేస్తుందా..? అన్న భీతిగొలిపే వార్తలు ప్రపంచ శాంతికామకుల నుంచి అన్నివర్గాల ప్రజల మదిని తొలుస్తున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిణామాలు ఉత్పన్నమవుతున్న వేళ.. ఇటు రష్యా కూడా యుద్దప్రదర్శన చర్యలకు దిగడమే ఇందుకు కారణమవుతుంది.

russia-bomb-h
జపార్డ్ యుద్ద విన్యాసాల క్రీడల్లో భాగంగా ఓ శిక్షణా యుద్ద ఛాపర్ (హెలికాప్టర్) ట్రయల్స్ వేస్తుంది. ఆ సమయంలో అందులో వున్న పైలట్ అనూహ్య తప్పిదాన్ని చేశాడు. అనుకోకుండా రాకెట్ ను వదలడంతో అది కాస్తా అర్మీ విన్యాసాలను వీక్షించేందుకు వచ్చిన వారిపైకి దూసుకెళ్లడంతో పలువురు గాయాలపాలయ్యారు. అంతకుముందు ఆ రాకెట్ నేరుగా అక్కడ పార్క్ చేసిన మిలిటరీ వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పార్క్ చేసిన అర్మీ వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రష్యా జపార్డ్ వార్ గేమ్స్ లో గందరగోళంగా నెలకొం‍ది.

ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్‌ మీడియాలో రష్యాకు చెందిన న్యూస్‌ చానెల్స్‌ పెట్టగా అవి కాస్తా వైరల్ గా మారాయి. రష్యా జపార్డ్ 2017 పేరిట పశ్చిమ రష్యాలోని నిర్జన ప్రాంతంలో ప్రత్యేక సైనిక కసరత్తుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వీటిని రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కూడా పర్యవేక్షిస్తున్నాడు. కాగా శిక్షణ సందర్భంగా యుద్ద చాఫర్ ను నడుపుతున్న పైలట్ అనుకోకుండా అకస్మాత్తుగా రాకెట్ ను రీలీజ్ చేశాడు. ఇందుక సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

russia-bomb-h
అయితే, శిక్షణ ప్రాంతంలో కొన్ని మిలిటరీ వాహనాలు నిలిపి ఉంచారు. మూడు వాహనాలు పక్కపక్కన.. మరో వాహనం వాటికి కొంచెం దూరంలో ఉండగా అప్పుడే విన్యాసాలు చేస్తూ అటుగా వచ్చిన హెలికాప్టర్ ఒకటి రాకెట్లను లాంచ్ చేసింది. దీంతో భారీ పేలుడుతో ఆ వాహనం ధ్వంసం అయింది. దాని ఎదురుగా ఉన్న నడుస్తూ వెళుతున్న ఓ మిలిటరీ వ్యక్తి అక్కడ రేగిన దుమ్ములో మునిగిపోయాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

/russia-bomb

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles