Bhagalpur dam collapses in Bihar ప్రజాధనం నీటిపాలు.. కుప్పకూలిన డ్యామ్

A day before inauguration rs 389 crore bhagalpur dam collapses in bihar

Bihar, Nitish kumar, Water Dam, Gateshwar Panth Canal Project, Lallan Singh, Bateshwarasthan Ganga Pump Canal Project, Bhagalpur, Jharkhand

A portion of the Gateshwar Panth Canal Project in Bihar’s Bhagalpur district collapsed during a trial run on Tuesday, a day before Chief Minister Nitish Kumar was scheduled to inaugurate it

ప్రజాధనం నీటిపాలు.. కుప్పకూలిన డ్యామ్

Posted: 09/20/2017 01:04 PM IST
A day before inauguration rs 389 crore bhagalpur dam collapses in bihar

బీహార్ లో ఇవాళ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. దాదాపు రూ.400 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఘటేశ్వర్ పంత్ కెనాల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని జాతికి అంకితం చేయనున్న ముందురోజే రాత్రి కూలిపోయింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదుగా ఇవాళ ప్రారంభం కావాల్సిన డ్యామ్ కు గండిపడి నీళ్లు మొత్తం దిగువ ప్రాంతాలకు వెళ్లడంతో లొతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ సహా జార్ఖండ్ ప్రభుత్వాలు కలసి సంయుక్తంగా నిర్మించిన భటేశ్వరస్థాన్ గంగా పంప్ డ్యామ్ ప్రాజెక్టును నిర్మించాయి.

దీంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ డ్యామ్ ను ప్రారంభోత్సవం చేయనున్నారని మీడియాలో విస్తృతంగా ప్రకటనలు కూడా బీహార్ నీటి పారుదల శాఖ జారి చేసింది. తీరా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందురోజునే అది కూలిపోయిందన్న వార్తతో తీవ్ర గందరగోళానికి గురైంది ప్రభుత్వం. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసిన ప్రభుత్వం.. డ్యామ్ కూలిపోవడానికి గల కారణాలపై ఇంజనీరింగు అధికారులతో దర్యాప్తు చేయిస్తుంది.

భగల్ పూర్ లోని కహల్గాన్ భటేశ్వరాస్థాన్ గంగా పంప్ కెనాల్ ప్రాజెక్టును నిర్మించేందుకు బీహార్, జార్ఖండ్ ప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 389.31 కోట్లను వెచ్చించింది. కెనాల్ లోని నీటిని నిల్వచేసి.. స్థానిక భగల్ పూర్ లో 18,620 హెక్టార్లు, జార్ఖండ్ లోని గొడ్డా జిల్లాలో 22,658 హెక్టార్ల మేర సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రాజెక్టు కూలిపోవడంతో.. ప్రజాధనం నుంచి వెచ్చించిన కోట్ల రూపాయలు నీటిలో కొట్టుకుపోయాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
 
బీహార్ జలవనరుల మంత్రి లల్లాన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రాజెక్టు లోపభూయిష్ట నిర్మాణం వల్లే కూలిపోయిందని విపక్షాలు అరోపిస్తున్నాయి. ప్రాజెక్టు కూలిపోవడానికి కారణాలు ఏమిటన్న విషయమై అల్ పార్టీ నేతృత్వంలో కమిటీని వేయాలని కూడా డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అయితే మంత్రి లల్లాన్ సింగ్ మాత్రం ‘పూర్తి సామర్థ్యంతో నీళ్లను ఒక్కసారిగా వదలడం వల్లే డ్యాం కూలిపోయిందని అంటున్నారు. ప్రస్తుత సంఘటన కారణంగా కొత్తగా కట్టిన ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేదని కూడా చెబుతున్నారు.

రాజకీయ లబ్దిని అశించే ప్రతిపక్షాలు దీనిని కూడా పెద్ద అంశంగా చిత్రీకరించవద్దని అంటున్నారు. మంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేసి.. కాంట్రాక్టర్లతో అధికారులు, రాజకీయ నేతలు కుమ్మకు కావడం వల్లే డ్యామ్ కూలిపోయిందని అరోపిస్తున్నాయి. కాగా డ్యాం కూలిపోవడంతో ఒక్కసారిగా పొంగుకొచ్చిన వరదతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles