Trai cuts interconnect charges to 6 paise a minute అక్టోబర్ 1 నుంచి తగ్గనున్న కాల్ చార్జీలు..

Trai cuts interconnect charges to 6 paise a minute from oct 1

Telecom regulator, Jio, interconnect usage charge, Bharti Airtel, 6 paise per minute, Reliance communications, Aircel, vodafone, idea cellular, telecom companies

India’s telecom regulator more than halved the interconnect usage charge (IUC) from October 1 and said the fee will be scrapped from 2020, in a move that it said would benefit consumers.

అక్టోబర్ 1 నుంచి తగ్గనున్న కాల్ చార్జీలు..

Posted: 09/20/2017 11:24 AM IST
Trai cuts interconnect charges to 6 paise a minute from oct 1

మొబైల్ ఫోన్ వినియోగ‌దారుల‌కు శుభవార్త. అక్టోబర్ ఒకటి నుంచి మీ కాల్ చార్జీలు తగ్గనున్నాయ్. ఈ మేరకు టెలికాం రెగ్యూలేటరి అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) నిర్ణయం తీసుకుంది. ఇంటర్ కనెక్షన్ చార్జీలను (ఐయూసీ)లను తగ్గించడంతో సెల్ ఫోన్ వినియోగదారులకు కాల్ చర్జీలు తగ్గే అవకాశం వుంది. ప్రస్తుతం ఐయూసీలకు 14 ఫైసలను వసూలు చేస్తుండగా, అక్టోబర్ 1 నుంచి వీటి చార్జీలను 6 ఫైసలకు తగ్గించనున్నారు. దీంతో అదే నెట్ వర్క్ కాకుండా ఇతర నెట్ వర్క్ ఫోన్లకు చేసే కాల్ చార్జీలు కూడా తగ్గనున్నాయి.

ఈ మేరకు ట్రాయ్ ఇవాళ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెలువరించింది. జనవరి 1 2020 నుంచి అంటే మరో రెండేళ్ల తరువాత ఐయూసీ చార్జీలను సున్నాగా చేయనున్నామని వెలువరించింది. అంటే ఇక ఏ సెల్ ఫోన్ అపరేటర్ నుంచి మరో సెల్ ఫోన్ అపరేటర్ కు ఎన్ని ఫోన్లు చేసుకున్నా ఒకొరికోకరు ఎలాంటి చార్జీలను భరించాల్సిన అవసరం లేదని కూడా ట్రాయ్ స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లు ఈ చార్జీలను భరిస్తున్న సెల్ ఫోన్ వినియోగదారులకు లబ్ది చేకూరనుందని ట్రాయ్ వివరించింది.

రిలయన్స్ జియో రాకతో వాయిస్ కాల్స్ కు డబ్బు కట్టే పరిస్థితి లేకుండా పోవడం.. దాంతో పాటు డాటా కూడా అత్యంత చౌకధరకు అందుబాటులోకి రావడంతో.. శరవేగంగా కస్టమర్లను తమ ఖాతాలోకి వెసుకుంటుంది. దీంతో ఐయూసీ చార్జీలను తగ్గించాలని ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ విషయమై దృష్టి సారించిన ట్రాయ్ ఈ మేరకు ఇవాళ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ఐయూసీ చార్జీలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని కూడా తెలిపింది.

అయితే ట్రాయ్ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా వుందని, ఇప్పటికీ అత్యంత తక్కువగా వున్న ఐయూసీ చార్జీలను సగానికి పైగా తగ్గించడం తమపై అదనపు భారం పడుతుందని టెలికాం రంగ దిగ్గజ సంస్థ అక్షేపిస్తున్నాయి. దీనిపై తాము న్యాయస్థానాలను అశ్రయిస్తామని భారతి ఎయిర్ టెల్ యాజమాన్యం స్పష్టం చేసింది. కాగా ట్రాయ్ తీసుకన్న ఐయూసీ చార్జీల తగ్గింపు నిర్ణయంతో రిలయన్స్ జియో సంస్థకు సుమారుగా రూ.5000 కోట్లు వార్షికాదాయం లబ్ది చేకూరుతుండగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు, ఎయిర్ సెల్ సంస్థలకు చెరో రూ. 250 కోట్లు లాభం చేకూరనుంది. అయితే భారతీ ఎయిర్ టెల్ సంస్థకు రూ.2వేల కోట్లు, వోడాఫోన్ కు రూ.1500 కోట్లు, ఐడియా సెల్యూలార్ సంస్థకు ఏడాదికి రూ.1200 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లనుందని అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telecom regulator  Jio  interconnect usage charge  Bharti Airtel  telecom companies  

Other Articles