Fuel Prices May Come Down By Diwali: Dharmendra Pradhan దీపావళికి దిగివస్తానంటున్న ఇం‘ధనం’..

Petrol diesel other fuel prices may come down by diwali dharmendra pradhan

Union minister, petroleum and natural gas, dharmendra pradhan, fuel price hike, fuel prices, diwali, petrol, dissel, crude oil, Goods and services tax gst, Mechanism, Daily basis, oil price fall diwali, oil prices fall next month, gst

Petroleum and Natural Gas Minister Dharmendra Pradhan said fuel prices may come down by Diwali, which falls next month. The comments come amid criticism by opposition parties of a sharp rise in oil prices

దీపావళికి దిగివస్తానంటున్న ఇం‘ధనం’.. కేంద్రం తీపికబురు..

Posted: 09/19/2017 11:56 AM IST
Petrol diesel other fuel prices may come down by diwali dharmendra pradhan

అంతర్జాతీయంగా కూడ్ర్ అయిల్ ధరలు తక్కవగానే వున్నా దేశీయ మార్కెట్లో మాత్రం ఇం‘ధనం’.. వాహనదారులను పిండేస్తుందన్న ప్రతిపక్షాల అరోపణలపై కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీసికబురును అందించారు. దీపావళి నాటికి పెట్రోలు ధరలు తగ్గుతాయని ఆయన వెల్లడించారు. రోజువారి ధరల పెంపు విధానం అమల్లోకి వచ్చిన తరువాత అయిల్ కంపెనీలు విపరీతమైన లాభాలను గడించడంతోనే వాహనదారులపై అతిగా భారం పడుతుందన్న విపక్షాల వాదన సరికాదని అన్నారు.

ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన రోజు వారి విధానంతో రోజుకు పైసల చోప్పును పెరుగుతున్న ఇంధన ధరలు పెట్రోల్ పై ఏకంగా 7రూపాయల మేర, డీజిల్ పై రూ.5 మేర పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ధరల పెంపుకు అసలు కారణం మాత్రం కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీ, అయిల్ కంపెనీల లాభాలు, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్ తదితరాలన్న అంశాన్ని అంగీకరించిన కేంద్ర మంత్రి.. ధరాఘాతానికి కారణం మాత్రం అగ్రరాజ్యమేనని వ్యాఖ్యానించారు.

అమెరికాలో వచ్చిన వరదల వల్ల అంతర్జాతీయంగా ఆయిల్ ఉత్పత్తి 13 శాతం తగ్గిపోయిందని.. దీంతోనే ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయే తప్ప.. అయిల్ కంపెనీలు లాభాల వల్లకానీ, రోజువారీ పెట్రోలు ధరల విధానం వల్లకానీ పెట్రోలు ధరలు పెరిగలేదని అన్నారు. అయితే పనిలో పనిగా వచ్చే నెల దీపావళి నాటికి చమురు ధరలు తగ్గుతాయని మంత్రి వాహనదారులకు తీపి కబురును అందించారు. అయితే దీపావళి నుంచి చమురును జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తున్నారా..? అన్న విషయమై క్లారిటీ మాత్రం ఇవ్వని మంత్రి.. ఇంధన ధరలు మాత్రం తగ్గుముఖం పడతాయని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dharmendra pradhan  fuel price hike  fuel prices  diwali  petrol  diessel  crude oil  petrol rates  diessel rates  

Other Articles