Iqbal Kaskar arrested for extortion మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తమ్ముడి అరెస్టు..

Dawood s brother iqbal kaskar arrested in extortion case

dawood ibrahim, iqbal kaskar, iqbal kaskar arrest, dawood ibrahim iqbal kaskar, ,pradeep sharma, anti-extortion cell, thane police, mumbai, india news

IN A DRAMATIC turn of events, the Thane Anti-Extortion Cell (AEC) arrested Iqbal Kaskar, younger brother of fugitive underworld don Dawood Ibrahim, along with two others

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తమ్ముడి అరెస్టు..

Posted: 09/19/2017 09:20 AM IST
Dawood s brother iqbal kaskar arrested in extortion case

భారత మోస్టు వాంటెడ్ జాబితాలో వున్న 1993 బొంబాయి పేలుళ్ల సూత్రధారి, కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో తలదాచుకున్నా అతని తమ్ముడు ఇక్బాల్ కస్కర్ మాత్రం యధేశ్చగా ముంబైకి వచ్చిపోతూ.. తన నివాసంలో బస చేస్తూ ఇంకా అక్రమాలకు పాల్పడుతూనే వున్నాడు. ఈ నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతూ, అక్రమంగా డబ్బు వసూళ్లు చేస్తున్నాడన్న అభియోగాలపై కస్కర్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.  

బొంబాయి పేలుళ్ల అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తలదాచుకున్న కస్కర్ ను ఒక హత్య కేసు, అక్రమ నిర్మాణానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసి, 2003లో భారత్ కు తీసుకొచ్చారు. అయితే 2007లో ఈ కేసుల నుంచి కస్కర్ విముక్తి పొందాడు. తాజాగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడన్న అభియోగాలు, పిర్యాదులు ఆయనపై దాఖలు కావడంతో.. ఇందుకు సంబంధించిన కేసుల నేపథ్యంలో ఇక్బాల్ కస్కర్ ను ముంబైలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

మాజీ ఎన్ కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ.. యాంటీ ఎక్టార్షన్ సెల్ ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే అక్రమ వసూళ్లకు, బెదిరింపులకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై ఇక్బాల్ కస్కర్ ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. థానేలోని యాంటీ ఎక్టార్షన్ సెల్ ఇంచార్జిగా ఆయన ఇటీవలే బాధ్యతలను స్వీకరించారు. కస్కర్ తో పాటు మరో ఇద్దరు బిల్డర్లను కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసు వర్గాలు స్పష్టంచేశాయి. తన సోదరుడి పేరును అడ్డం పెట్టుకుని కస్కర్ పలు బిల్డర్లు, వ్యాపార వేత్తలను బెదిరింపులకు గురిచేసి అక్రమవసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dawood ibrahim  iqbal kaskar  pradeep sharma  anti-extortion cell  thane police  mumbai  india news  

Other Articles