ICICI Bank home loan festive offer రుణం తీసుకుంటే ఎదురు కమీషన్.. ఐసీఐసీఐ అఫర్

Icici bank offers rs 10000 cashback on home loans

ICICI Bank, ICICI Bank new offer, ICICI Bank credit card offer, ICICI Bank debit card offer, new offer, Home Loan, ICICI credit card, ICICI debit card, ICICI Offers, ICICI cashback offer, latest news

ICICI Bank announced a cashback scheme for borrowers who receive sanction for a home loan or transfer of their existing home loan with another lender to ICICI Bank.

రుణం తీసుకుంటే ఎదురు కమీషన్.. ఐసీఐసీఐ అఫర్

Posted: 09/16/2017 12:53 PM IST
Icici bank offers rs 10000 cashback on home loans

నోట్ల రద్దు పుణ్యమా అని గత కొన్నేళ్లుగా వెలవెలబోయిన బ్యాంకుల్లో గలగల రాగాలు. కాసుల నిల్వలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నిల్వలపై అదాయం సమకూర్చుకునే మార్గాలను బ్యాంకులు అన్వేషిస్తున్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన అర్థిక విధానాలకు తోడు జీఎస్టీలతో సతమతమవుతున్న సగటు భారతీయడు.. బ్యాంకు రుణాలు జోలికి కూడా పోవడం లేదు. అయినా అతనికి అవసరం వున్నా లేకున్నా.. రుణం తీసుకోండంటూ బ్యాంకులు వెంటబడుతున్నాయి.

పండగ సీజన్ దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు కొత్త పథకాలు తీసుకొస్తున్నాయి. అలాగే, పెద్దగా హామీలు అక్కర్లేకుండానే కొన్ని గంటల్లోనే రుణాలు మంజూరు చేస్తున్నాయి. తాజాగా దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ పండగ సీజన్‌లో ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో రుణం కావాలంటే కమీషన్ నోక్కిసే బ్యాంకు ఏజెంట్లు.. చెక్ పెట్టి.. గృహరుణం తీసుకునేవారికి క్యాష్ బ్యాక్‌ అపర్ ను కూడా వర్తింపజేస్తామని ఐసీఐసీఐ ప్రకటించింది.

ఈ ఆపర్ కొత్తగా గృహరుణం తీసుకునేవారితో పాటు.. ఇరత బ్యాంకులో ఉన్న రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకుకు బదిలీ చేసుకున్న వారికి మాత్రమేనని, అందునా.. ఈ అఫర్ సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు మాత్రమే వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. క్యాష్ బ్యాక్ అఫర్ కింద 20 శాతం లేదా పది వేల రూపాయలను రుణం పోందిన తరువాత మూడు నెలల్లోపు అకౌంట్ లో జమఅవుతుందని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు.
 
అయితే, ఈ ఆఫర్ ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డును వినియోగించి రూ.30,000 కొనుగోళ్లు జరిపిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు ఓ నిబంధనను కూడా విధించింది. ఒక కార్డుకు ఒకసారి మాత్రమే క్యాష్ బ్యాక్‌ ఆపర్ వస్తుంది. పథకం అందుబాటులో ఉన్న సమయంలో గృహరుణం పొందటంతో పాటు, సదరు వినియోగదారుడు క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా రూ.30వేల లావాదేవీ జరపాల్సి ఉంటుంది. మరెందుకు అలస్యం.. రుణం కావాలంటే చలో ఐసిఐసిఐ బ్యాంక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles