JEE single entrance exam for engineering across India అటకెక్కనున్న ఎంసెట్.. ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఇక జేఈఈ మాత్రమే

From 2018 single exam for engineering and architecture across india

AICTE, HRD ministry, Single engineering & architecture exam, JEE, JEE-Advanced, Prakash Javadekar

Admission to all engineering colleges in the country will be done through a single entrance examination from next year, doing away with multiple tests conducted by central agencies, state governments and private institutions.

అటకెక్కనున్న ఎంసెట్.. ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఇక జేఈఈ మాత్రమే

Posted: 09/13/2017 10:19 AM IST
From 2018 single exam for engineering and architecture across india

దేశవ్యాప్తంగా ఒక పన్ను విధానాన్ని తీసుకువచ్చిన కేంద్రం జీఎస్టీ పేరుతో ప్రజల సోమ్మును కొల్లగోడుతూనే వుంది. అన్నింటికీ వర్తించే జీఎస్టీ ఇంధనంపై మాత్రం వర్తించకుండా చర్యలెందుకు తీసుకుందో తెలియని పరిస్తితి. ఇక అదేబాటలో దేశవ్యాప్తాంగా ఒక మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష అంటూ కేవలం ఉత్తరాది వారికే పెద్దపీటే వేసే కుట్ర జరుగుతుందని అరోపిస్తూ నీట్ పరీక్షలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలలో అంధోళనలు జరుగుతున్నాయి. తమిళనాడుకు చెందిన అనిత అనే ఓ విద్యార్థిని నీట్ ను వ్యతిరేకిస్తూ తనపు చాలించుకుంది కూడా.

అయినా తనకేమీ పట్టనట్లు వ్యహరిస్తున్న కేంద్ర మానవ వనరుల శాఖ 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌ ప్రవేశాలను కూడా రాష్ట్రస్థాయిలో బంద్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇకపై ఇంజనీరింగ్ కోర్పుల ప్రవేశాలకు కూడా దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేయాలని కసరత్తును ప్రారంభించింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ఇంజనీరింగ్‌ ప్రవేశాలను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారానే నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వాలకు ఇప్పటికే అదేశాలను జారీ చేసినట్లు తెలిసింది.

ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ ప్రవేశపరీక్షల అధారంగానే ఇకపై ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలను చేపట్టనున్నాట్లు రాష్ట్రప్రభుత్వాలకు పంపిన అదేశాలలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ  పొందుపర్చింది. ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశం కోరుకునే విదర్యార్థులు ఇక తప్పకుండా జేఈఈ మెయిన్‌ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష తర్వాత విద్యార్థులు జాతీయ స్థాయిలో పొందిన ర్యాంకులకు అనుగుణంగా వారికి రాష్ట్ర ర్యాంకులను కేటాయిస్తారు. వాటి ద్వారా ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తారు. ఇదే జరిగితే ఎంసెట్‌ పరీక్ష కేవలం బిపార్మసీ, వ్యవసాయ కొర్సులకు మాత్రమే నిర్వహించాల్సివుంటుంది. దీంతో ఎంసెట్ పేరు కాస్తా మార్చి మరో పేరుతో ప్రవేశాలను నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles