Ramdev’s name missing from ‘fake baba’ list దొంగబాబాల జాబితాలో ఆయన పేరు ఎలా మిస్సైంది.?

Disappointed over ramdev s name missing from fake baba list digvijaya

Digvijaya Singh, Baba Ramdev, Digvijay on baba ramdev, Digvijay thug remark, Digvijay disappointment, baba ramdev fake baba list, Akhil Bharatiya Akhara Parishad, Fake Babas, Asaram Bapu, Sant Rampal, and Gurmeet Ram Rahim Singh

Senior Congress leader Digvijaya Singh said he was “disappointed” over the missing name of Baba Ramdev from a list of ‘fraud’ saints released a day earlier by a religious body.

ఆ దొంగబాబాలకు ఈ బాబాకు తేడా ఏంటయ్యా.? డిగ్గీ బాంబ్.!

Posted: 09/12/2017 11:09 AM IST
Disappointed over ramdev s name missing from fake baba list digvijaya

దేశ ప్రధానినే టార్గెట్ చేసి.. అ ట్విట్ తాను చేయలేదని, ఎవరో తన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి ప్రధానికి వ్యతిరేకంగా అత్యంత అసభ్యకర రీతిలో ట్విట్ ను పోస్టుచేశారని కవరింగ్ ఇచ్చుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తాజాగా యోగా గురువు బాబా రాందేవ్ ను మాత్రం నేరుగానే టార్గెట్ చేశారు. బాబా రాందేవ్ ను దొంగ బాబా అని నేరుగానే విమర్శించారు. అఖిల భారతీయ ఆకార పరిషత్‌ తాజాగా విడుదల చేసిన 14 మంది దొంగ బాబాల పేర్లలో బాబా రాందేవ్ పేరును ఎందుకు చేర్చలేకపోయిందోనని తీవ్ర నిరాశకు గురయ్యారు.

అయుర్వేదం పేరుతో.. దేశ ప్రజలను మోసం చేసి నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని సొమ్మ చేసుకుంటున్నాడని ఆరోపించారు. అఖిల భారతీయ ఆకార పరిషత్ జాబితాలోని బాబాలు తమ వద్దకు వచ్చిన భక్తులనే మోసం చేస్తుండగా, బాబా రాందేవ్ మాత్రం.. టీవీలు, పేపర్లలో ప్రకటనలు గుప్పించి మరీ ప్రజలను మోసం చేస్తున్నాడని అరోపించారు. అదే పేరుతో ఇటు అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఉచితంగా ప్రభుత్వ భూమిని పోందుతూ.. వాటిలో తన సంస్థ కార్యకలాపాలు సాగిస్తూ.. వాటిని దేశప్రజలకు విక్రయించి డబ్బును అర్జిస్తున్నాడని అరోపించారు.

ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తూ.. నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా నకిలీ బాబేనని దిగ్విజయ్ అన్నారు. మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మిక వేత్తగా ఉన్న వ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్‌ ను అడిగారు. అదేవిధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ పరిషత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక అఖిల భారతీయ ఆకార పరిషత్‌ విడుదల చేసిన జాబితాలో ఆశారాం బాబు, రాధేమా, సచ్ దరంగి, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌, ఓం బాబా, నిర్మల్ బాబా, విశ్వానంద్‌, స్వామి అశ్మిదానంద్‌, ఓం నమః శివాయ్‌, నారాయణ్ సాయి రాంపాల్ లు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles