china thief used toilet paper to cover his face కెమరా కంటికి చిక్కకూడదని.. దొంగ ఇలా...

Toilet paper used by thief for not being caght on cam

China, china thief used toilet paper to cover his face, thief covered his face with toilet paper, burglary, CCTV, toilet paper, china thief, burglary, cctv, robbery, china robbery, china thief, thief on cctv, robbery fails, funny robbery fails, thief wraps toilet paper around head, world news

To avoid identification on CCTV, a thief wrapped his head with toilet paper before entering an empty hospital in Huaibei City, China to rob it on the night

ITEMVIDEOS: కెమెరా కంటికి చిక్కకూడదని.. దొంగ ఇలా...

Posted: 09/11/2017 01:45 PM IST
Toilet paper used by thief for not being caght on cam

దొంగతనం చేయడమే తప్పు. అసలు అలాంటి అలోచన రావడం కూడా తప్పే. దొరికితే ఊచలు లెక్కబెట్టాల్సి వస్తందని తెలిసినా.. దొంగలు మాత్రం కొత్త కొత్త ఐడియాలతో తాము ఎవరి కంటా పడకుండా దొరికింది దోచుకెళ్లాలనని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అందుబాటులోకి వచ్చిన మూడో నేత్రం నుంచి తప్పించుకోలక చాలా మంది దొరికేస్తున్నారు. అయితే ఈ నిఘా నేత్రం నుంచి కూడా తప్పించుకునేందుకు ఓ దోంగ కొత్త ఐడియాను వాడి.. విఫలమై.. నెట్టింట్లో వైరల్ గా మారాడు. ఇంతకీ అతనికి తట్టిన కొత్త ఐడియా ఏంటో తెలుసా.?

చైనాలోని హ్యుయ్‌బే నగరంలో ఓ దొంగ మాత్రం తనను ఎవరూ గుర్తుపట్టకుండా.. సీసీ కెమెరాల్లో తన ముఖం కనపడకుండా ఉండేందుకు ముఖానికి (కళ్లను మాత్రమే మినహాయించి) పూర్తిగా టాయిలెట్‌ పేపర్ కట్టుకుని దొంగతనానికి వెళ్లాడు. అతడు గదిలోనికి ప్రవేశించడం.. టాయిలెట్‌ పేపర్‌ ముఖానికి చుట్టుకోవడం.. సీసీ కెమెరాలను చూస్తూ వెళ్లడం అంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయింది.

అయితే ఒక గది నుంచి వేరే గదికి వెళ్లిన అతడు అటూ ఇటూ చూస్తూ వెళ్లే క్రమంలో తన ముఖానికి వున్న టాయిలెట్‌ పేపర్‌ వూడిపోయింది. దీంతో మరో కాయితం తీసుకుని సిసిటీవీ కెమెరాకు పెట్టే ప్రయత్నం చేశాడు దొంగ. దీంతో రెండో గదిలోని సిసిటీవీ కెమెరాలో అతని ముఖం స్పష్టంగా సిసిటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఈ వీడియోను స్థానిక వెబ్ పోర్టల్ ఫేస్ బుక్ లో పోస్టు చేయగా, అది కాస్తా వైరల్ అయ్యింది. ఇప్పటివరకు ఈ వీడియోను 1.24 లక్షల మంది వీక్షించారు. అయితే ఈ దొంగతో పాటు దొంగతనం కూడా కేవలం స్థానిక మీడియా సృష్టించిన ఫేక్ ఐడియా కూడా కావచ్చని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  thief covered his face with toilet paper  burglary  CCTV  world news  

Other Articles