rahul dont politicise gauri Lankesh murder says ravi shanker సమాచారమిస్తే రూ.10 లక్షల పారితోషకం..

Karnataka govt declares rs 10 lakh for info on gauri lankesh murder

Ravi Shankar Prasad, Gauri Lankesh, Ravi Shankar, Rahul Gandhi, Naxalites, Karnataka, Congress, Human Rights, RSS activists murder, security, bengaluru police, Gauri Lankesh, Gauri Lankesh Murder, Gauri Lankesh murder case, ramalinga reddy

Karnataka Home Minister Ramalinga Reddy announced a reward of Rs 10 lakh for anyone who can help the police nab the killers of journalist Gauri Lankesh.

సమాచారమిస్తే రూ.10 లక్షల పారితోషకం..

Posted: 09/08/2017 05:47 PM IST
Karnataka govt declares rs 10 lakh for info on gauri lankesh murder

బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ దారుణ హత్య జరిగి మూడు రోజులు కావస్తున్న పోలీసులు ఇంకా ఈ కేసులో అడుగుముందుకు వేయలేదు. అందుకు కారణం వారికి హంతకుల విషయంలో ఎలాంటి కీలక అధారాలు లభ్యం కాకపోవడమే. దీంతో గౌరీ లంకేశ్ హత్య కేసులో ప్రజలకు, స్థానికులకు తెలిసిన సమాచారాన్ని తమతో పంచుకోవాలని, ఈ కేసులో నిందితులను పంట్టుకునేందుకు కీలక సమాచారం అందంచిన వారికి రూ. 10 లక్షల బహుమతి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కేసు దర్యాఫ్తు విషయాలపై హోం మంత్రి రామలింగారెడ్డితో కలసి సమీక్షించిన సీఎం సిద్ధరామయ్య, నిందితులను త్వరగా అదుపులోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కాగా, ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం అందుతోంది. హంతకుల వయసు 30 సంవత్సరాల వరకూ ఉండవచ్చని, హెల్మెట్ ధరించి వచ్చాడని ఆపై పారిపోయాడని వెల్లడించారు. నిందితుడి ఊహా చిత్రాన్ని రూపొందించి, అతని ఆచూకీ కోసం రాష్ట్రమంతా గాలిస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుండగా, గౌరీ లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ స్పందించక పోవడాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి స్పందించే మోదీ ఓ ప్రముఖ జర్నలిస్టు విషయంలో ఎందుకు మౌనం దాల్చారని ప్రశ్నిస్తున్నాయి.

జర్నలిస్టుల దేశ వ్యాప్త ఆందోళనలకు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉద్యమకారుల నినాదాలకు విస్తృత ప్రచారం లభించింది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ప్రధానమంత్రి గానీ, పీఎంవోల నుంచి గానీ ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ కొందరు ట్విట్టర్ వేదిక చేసిన విమర్శలు మాత్రం.. ఈ విదాదంలోకి మోదీని లాగే ప్రయత్నం చేశాయి. అందులో నలుగురి ట్వీట్లు రాజకీయ, వామపక్ష వర్గాల్లో చర్చకు కారణమయ్యాయి. ఆ నలుగులు ప్రధాని ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్ కావడంతో వారి పోస్టులు సంచలనమయ్యాయి.

ఇదిలావుండగా, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయమై స్పందిస్తూ.. గౌరీ లంకేశ్ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఎందుకని అమెకు భద్రతను కల్పించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతోనే మావోయిస్టులతో గౌరి చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చారని.. అలాంటి మనిషి ప్రాణహానీ వుంటుందని ప్రభుత్వానికి తెలియదా..? అయినా ఆమెకు ఎందుకు సెక్యురిటీ ఇవ్వలేదని నిలదీశారు.  కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ కార్యకర్తల హత్యలు ఉదారవాదులు ఎందుకు కనిపించవని ఆయన మరో కోణంలోకి వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Shankar Prasad  Gauri Lankesh  Rahul Gandhi  Naxalites  Karnataka  

Other Articles