Govt lists 3 levels of offences for 'No-Fly List' విమానాల్లో వివాదాలకు చెక్.. భద్రతకు పెద్దపీట

Unruly fliers could be banned for life no fly rules

Ravindra Gaikwad, NO-FLY LIST, JC Diwakar Reddy, Indigo air, Air India, No fly rules,Gajapathi Raju

The government said the no-fly ban will be in addition to any legal action that can be taken against an offender under existing laws. Physically abusive behaviour like pushing, kicking, hitting or inappropriate touching will mean a ban of up to six months.

విమానాల్లో వివాదాలకు చెక్.. భద్రతకు పెద్దపీట

Posted: 09/08/2017 06:24 PM IST
Unruly fliers could be banned for life no fly rules

విమానాలు, విమానాశ్రయాలలో వివాదాలకు దిగితే.. ఇకపై నో ఫ్లై బ్యాన్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. విమాన ప్రయాణికుల భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని నోఫ్లై జాబితాను ఇవాళ విమానయాన శాఖ విడుదల చేసింది. వివాదాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వారు చేసే వివాదాలలను పరిగణలోకి తీసుకుని మినిమమ్ మూడు నెలల నిషేదం నుంచి మాక్సీమమ్ జీవితకాలం వరకు వేటు విధించింది. మరీ ముఖ్యంగా ఇందులో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను మూడు స్థాయిలుగా పేర్కొంది. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా పేర్కొన్నారు.

లెవల్‌ 1

దూషించడం, మద్యం తాగి అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా సైగలు చేయడం.. 3 నెలల వరకు నిషేధం

లెవల్‌ 2 

సిబ్బందిని నెట్టడం, కొట్టడం, భౌతికంగా దాడి చేయడం, అసభ్యంగా తాకడం.. 6 నెలల వరకు నిషేధం

లెవల్‌ 3 

బెదిరింపులకు పాల్పడటం, ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌ను ధ్వంసం చేయడం వంటివి.. రెండేళ్ల నుంచి జీవిత కాలం పాటు నిషేధం

కాగా. ఈ నూతన నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. విమానాల్లో ప్రయాణానికి తప్పనిసరిగా మారిన ఫోటో ఐడీ కార్డును ఇకపై విమాన టిక్కెట్ల బుకింగ్ కు కూడా తప్పనిసిర చేయాలన్న యోచనలో విమానయాన శాఖ వుంది. టిక్కెట్ల బుకింగ్ కోసం ఏదో ఒక ఐడీ కార్డును జతచేయడం తప్పనిసరి చేయాలని ఫోటో గుర్తింపు కార్డులతోనే టికెట్లు బుక్ చేసుకుని వాటినే ప్రయాణ సమయాల్లో కూడా విమానాశ్రయ అధికారులకు చూపించేలా నిబంధనను తీసుకురావాలన్న యోచనలో వున్నామని జయంత్ సిన్హా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravindra Gaikwad  NO-FLY LIST  JC Diwakar Reddy  Indigo air  Air India  

Other Articles