Minister Akhila priya shocked with her forgery signature మంత్రి అఖిలప్రియకు షాక్..

Minister akhila priya shocked with her forgery signature

minister forgery signature letter, unemployed youth gives shock to minister, minister akhila priya shocked, akhila priya signature forgery, akhila priya forgery signature, ap tourism minister, ali, pedakurapadu, unemployed youth, seeking job, forgery signature, crime

A man Ali from pedakurapadu gives shock to andhra pradesh tourism minister bhuma akhila priya who handovered a forgery signature letter of her seeking a job in a week

మంత్రి అఖిలప్రియకు షాకిచ్చిన నిరుద్యోగి..

Posted: 09/06/2017 05:42 PM IST
Minister akhila priya shocked with her forgery signature

టీడీపీకి ఓటు వేస్తే.. అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం.. ఉద్యోగం రానీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్న మాటాలు నమ్మి.. ఓటేవేసిన ఓ నిరుద్యోగి గత మూడేళ్లుగా వేచి చూసి.. ఉద్యోగం రాకపోవడంతో ఓ అలోచన చేశాడు. దానిని అనుకున్న విధంగానే అమలులో పెట్టాడు. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిలప్రియకు షాకిచ్చాడు. తప్పుడు సంతకంతో ఆమెను బురిడీ కొట్టించాలని ప్రయత్నించి చివరకు అడ్డంగా దొరికిపోయి కటకటాలు లెక్కపెడుతున్నాడు. అసలింతకీ ఆ నిరుద్యోగి ఎవరు..? ఆయన చేసిన అలోచనేమిటీ..? అంటారా..? అక్కడికే వస్తున్నాం..

అతని పేరు అలీ. పెదకూరపాడుకు చెందిన నిరుద్యోగి. అయితే ఎలాగైనా తాను ఉద్యోగం సంపాదించాలని భావించిన అలీ.. వక్రమార్గాన్ని ఎంచుకున్నాడు. ఏకంగా అఖిలప్రియ సంతకాన్నే ఓ లేఖ మీద ఫోర్జరీ చేశాడు. తీరాచూస్తే ఆ లేఖను తీసుకెళ్లి మళ్లీ అఖిలకే అందజేశాడు. అలీ ఇచ్చిన లేఖను చూసి ఔరా అని అవాక్కయిన అఖిలప్రియ.. ఈ సంతకం తనది కాదని.. తన సంతకం పోర్జరీ జరిగిందని తెలుసుకుంది. వెంటనే తన సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు.

ఇంతకీ అ లేఖలో ఏముంది..? తన సిబ్బందికి ఏమని అదేశాలు జారీ చేసింది..? అన్న విషయం తెలుసుకోవాలని వుందా..? తాను ఇచ్చినట్లు నిరుద్యోగి అఖిలప్రియకు అందజేసిన లేఖలో.. అలీ అనే వ్యక్తికి వారం రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలంటూ అమె సిఫారసు చేసినట్లు వుంది. అది చూసి ఖంగుతిన్న అమె.. తన సిబ్బందికి ఫోన్ చేసి.. తన సంతకం పోర్జరీ జరిగిందని, దీనిపై వెంటనే ఎస్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అదేశించారు. దీంతో అమె పేషీలోని సిబ్బంది పిర్యాదు మేరకు హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు నిరుద్యోగి అలీని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akhila priya  forgery signature  ap tourism minister  ali  pedakurapadu  unemployed youth  amaravati  crime  

Other Articles