Traffic curbs for Ganesh Visarjan in Hyderabad

Traffic diversion due to ganesh shobha yatra

Ganesh Immersion, Ganesh Immersion 2017, Ganesh Immersion Shobha Yatra, Hyderabad Traffic Diversion, Traffic Diversion Ganesh Yatra

Ganesh Immersion 2017 procession in Hyderabad. Traffic Diversion due to Shobha Yatra.

రేపే నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు...

Posted: 09/04/2017 03:10 PM IST
Traffic diversion due to ganesh shobha yatra

గ‌ణేశ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా సెప్టెంబర్ 5 అంటే రేపు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు తెలంగాణ‌ డీజీపీ అనురాగ్‌శర్మ ప్రకటించారు. ఈ ఏడాది కూడా ఖైరతాబాద్‌ మహాగణపతిని ముందస్తుగానే నిమజ్జనం చేయిస్తామ‌ని.. తర్వాతే మిగతా వాటిని జరిపిస్తామని ఆయన తెలిపారు.

నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని చెప్పిన ఆయన నగరంలో 26 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. 18 ఫ్లాటూన్ల కేంద్ర బలగాలు కూడా హైద‌రాబాద్ చేరుకున్నాయ‌ని చెప్పారు. న‌గ‌రంలోని ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు చెప్పారు.

నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా న‌గ‌రంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులను, ప్రతి అర్ధగంటకు ఒక ఎంఎంటీఎస్‌ రైలు ఏర్పాటును చేస్తున్న‌ట్లు తెలిపారు. సికింద్రాబాద్, ఉప్పల్, హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలతోపాటు, బెంగళూర్, ముంబై నుంచి వచ్చే వాహనాలను కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలించనున్నట్లు ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganesh Shoba Yatra 2017  Hyderabad  Ganesh Immersion  

Other Articles