Talent and Core Candidates in Modi Cabinet after Reshuffle

Modi new cabinet something special

Prime Minister Narendra Modi, Cabinet Reshuffle, 2019 Lok Sabha Elections Modi Cabinet, Modi New Cabinetm Special Cabinet Modi, Modi Cabinet Profiles, Talent and Core new Ministers

Cabinet reshuffle highlights govt priorities ahead of 2019 Lok Sabha elections. The choices for cabinet berths reflect BJP’s focus on election-bound states and the electoral arithmetics.

మోదీ కొత్త కేబినెట్ ఎందుకంత స్పెషల్

Posted: 09/04/2017 07:19 AM IST
Modi new cabinet something special

అనూహ్య నిర్ణయాలు తీసుకునే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ లోనూ అదే పంథాను కొనసాగించారు. పాత వాళ్లకి మార్చిన శాఖలతోపాటు కొత్త మంత్రులకు ఊహించని రీతిలోనే శాఖలు కేటాయించారు. నలుగురు మంత్రులపై నమ్మకంతో కీలక బాధ్యతలను ప్రమోషన్ లో భాగంగా అప్పగించినట్టు సమాచారం. అన్నింటికి కన్నా హైలెట్ నలుగురు నిజాయితీపరులుగా పేరున్న మాజీ బ్యూరోక్రట్ లకు మంత్రి వర్గంలో చోటు కల్పించటం. ఆపై నిర్మలా సీతారామన్‌ కు కీలకమైన రక్షణ శాఖను అప్పగించించటం, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనంతకుమార్ హెగ్డేకు కూడా కేబినెట్ లో సహయ మంత్రిగా బెర్తు దక్కటం.


సురేష్ ప్రభు తప్పుకునేందుకు సిద్దం కావటంతో పీయూష్‌ గోయల్‌ కు రైల్వే శాఖ, ధర్మేంద్ర ప్రదాన్‌ కు పెట్రోలియం శాఖ, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి మైనార్టీ సంక్షేమ శాఖలను అప్పగించారు. ఇప్పటి వరకు రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభుకు కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ, నితిన్‌ గడ్కరీకి జలవనరుల శాఖను అప్పగించనున్నట్టు సమాచారం. కొత్తగా కేంద్రమంత్రి బాధ్యతలు చేపట్టిన హర్దీప్‌ సింగ్‌ కు వాణిజ్య పన్నుల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కట్టబెట్టారు.

నిర్మలా అరుదైన రికార్డు...

రక్షణ శాఖామంత్రిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ (58) చరిత్ర సృష్టించారు. 2014 నుంచి బీజేపీ అధికార ప్రతినిధిగా, వాణిజ్య శాఖ సహాయమంత్రిగా ఉన్న ఆమెను ప్రధాని మోదీ ఏకంగా కీలకమైన రక్షణ శాఖను అప్పగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన సీతారామన్ ఆ శాఖను నిర్వహిస్తున్న రెండో మహిళగా చరిత్రకెక్కారు. గతంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉంటూనే రక్షణ శాఖను చూసేవారు.

అయితే ఆ శాఖ భాద్యతలు పూర్తిస్థాయిలో చేపట్టిన తొలి మహిళ మాత్రం నిర్మలనే. ఇక మోదీ కేబినెట్‌లో కీలక పదవుల్లో ఇద్దరు మహిళలు ఉండడం గమనార్హం. సుష్మాస్వరాజ్ విదేశీ వ్యవహారాలు చూస్తుండగా, ఇప్పుడు నిర్మల ఏకంగా రక్షణ మంత్రి పదవి చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ యుద్ధ రంగంలోకి మహిళలను తీసుకోవడంపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు.


తెలుగు స్టేట్స్ కు హ్యాండ్...

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి ఎదురైంది. 9 కొత్త ముఖాలకు స్థానం కల్పించినప్పటికీ తాజా విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ స్థానం కల్పించకపోవడం గమనార్హం. మంత్రి పదవి ఊహాగానాల నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు నిరాశ ఎదురైంది. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్థానంలో వెదిరె శ్రీరామ్‌ లేదా మురళీధర్‌ రావును తీసుకుంటారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయనది కూడా సేమ్ పరిస్థితి.

కేబినెట్‌ మినిస్టర్ గా ఉన్న వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ప్రమోట్ కావడం.. కేంద్ర మంత్రి పదవి నుంచి బండారు దత్తాత్రేయకు ఉద్వాసన పలకడంతో రెండు తెలుగు రాష్ట్రాలు రెండు మంత్రి పదవులను త్యాగం చేశాయి. వీరి స్థానంలో ఒక్కరికైనా స్థానం కల్పిస్తారని ఆశించారు. అయితే అందరి ఆశలు అడియాసలు చేస్తూ ఎవరికీ పదవులు దక్కలేదు. దీంతో కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఏపీ నుంచి తెలుగు దేశం తరఫున అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి మంత్రులుగా ఉండగా, తాజాగా మంత్రి వర్గ విస్తరణలో ఏపీతో సంబంధం ఉన్న నిర్మలా సీతారామన్‌ కు కీలకమైన రక్షణ శాఖ అప్పగించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles