కాకినాడ కార్పొరేషన్ లెక్కింపు ప్రారంభం. మద్యాహ్నాంలోపే లెక్క తేలుతుంది | Counting underway for Kakinada Municipal Corporation elections

Counting underway for kakinada municipal corporation elections

Kakinada Municipal Corporation Elections, Kakinada Corporation Elections Counting, Kakinada Municipal Corporation Elections Results, Kakinada Corporation Elections Results Live, Kakinada Municipal Corporation Election Results Live, Kakinada Municipal Corporation Elections Upfates, Kakinada Municipal Corporation Elections Counting Updates

Counting begins for Kakinada Municipal Corporation Elections. TDP Confident on Majority seats Victory.

కాసేపట్లో కాకినాడ కార్పొరేషన్ తీర్పు

Posted: 09/01/2017 07:36 AM IST
Counting underway for kakinada municipal corporation elections

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు నేడు విడుదలనున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా, 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 14 డివిజన్లకు సంబంధించిన 1వ నెంబర్ ఈవీఎంలను తొలుత లెక్కిస్తారు. కొన్ని డివిజన్లకు సంబంధించిన ఫలితాలు 3 రౌండ్లలోనే వెలువడే అవకాశం ఉంది.

కొన్ని చోట్ల 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 14 డివిజన్ల ఫలితాలు తెలియనున్నాయి. ఒక్కో రౌండ్ కు 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టవచ్చని, ప్రతి గంటకు సగటున 14 డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయని అంచనా. కాగా, ఈ నెల 29న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 50 డివిజన్లు ఉండగా, 48 డివిజన్లకే పోలింగ్ జరిగింది. హైకోర్టులో విచారణ కారణంగా మిగిలిన రెండు డివిజన్లకు పోలింగ్ నిర్వహించలేదు.

ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలసి పోటీ చేశాయి. టీడీపీ 39 డివిజన్లలో, బీజేపీ 9 డివిజన్లలో బరిలోకి దిగగా, వైసీపీ 48 డివిజన్లలోనూ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 17 చోట్ల, సీపీఐ, సీపీఎం రెండు చోట్ల, బీఎస్పీ 3 చోట్ల పోటీ చేశాయి. మొత్తంగా 48 డివిజన్లలోనూ బరిలోకి దిగిన అభ్యర్థుల సంఖ్య 241. ఇదిలా ఉండగా, నంద్యాల ఉపఎన్నిక ఫలితమే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని, 37 డివిజన్లలో గెలిచి తీరతామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kakinada  Municipal Corporation Elections  Counting  

Other Articles