ఉత్తర కొరియాపై దాడి చేస్తే ఊరుకోం.. ట్రంప్ కు ఊహించని వార్నింగ్ | Russia warns US against new sanctions on North Korea

Russia support to north korea agaist america

Russia, America, North Korea, Sergey Lavrov, North Korea sanctions, Russia Supports North Korea, Russia Warn America, Sergey Lavrov Warn America

Russia warns US against new sanctions on North Korea. Russia's foreign minister warns Tillerson: New North Korea sanctions could be 'dangerous'.

కొరియాకు గట్టి సపోర్ట్ దొరికిందిగా...

Posted: 09/01/2017 07:30 AM IST
Russia support to north korea agaist america

ఊహించని రీతిలో ఉత్తరకొరియాకు ఊహించని ఆపన్నహస్తం అందింది. ఉత్తరకొరియాపై సైనిక చర్యకు దిగితే ఊహించలేని పరిణామాలు ఎదురవుతాయని రష్యా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా- ఉత్తరకొరియాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపు దాలుస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మాత్రమే పరిమితమైన ఈ రెండు దేశాలు యుద్ధానికి వెనుకాడడం లేదు. బాంబుపరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాల గుండెల్లో గుబులురేకెత్తిస్తున్నాయి.

గ్వామ్ దీవిపై దాడికి ఉత్తరకొరియా రిహార్సల్స్ చేయగా, ఉత్తరకొరియా సరిహద్దుల్లో బాంబులు వేయడం ద్వారా అమెరికా భయపెట్టింది. ఏమాత్రం దూకుడుగా వ్యవహరించినా, తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో రష్యా రంగంలోకి దిగింది. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ రెక్స్ టిల్లర్‌ సన్‌ కు రష్యా విదేశీవ్యవహారాల శాఖా మంత్రి సెర్జీ లవ్‌ రోవ్ ఫోన్ చేశారు. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరకొరియాపై సైనిక చర్య ఆలోచనను విరమించుకోవాలని ఆయన హెచ్చరించారు.

మిలిటరీ విన్యాసాల పేరుతో దక్షిణ కొరియాలో అమెరికా సైన్యంతో పాటు పెద్ద పెద్ద బాంబర్లను మోహరించడం ఉత్తరకొరియాను ఆత్మరక్షణలో పడేస్తుందని, దీంతో ఆ దేశం తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనిని అవకాశంగా తీసుకుని ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించడం కూడా ప్రమాదమని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో కిమ్ చర్యలు తీవ్రమైనవని, ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘించడమేనని సెర్జీ లవ్‌ రోవ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  North Korea  Russia  

Other Articles