China's FM hails resolution in Doklam standoff అవే కుట్రపూరిత వ్యాఖ్యలు చేసిన డ్రాగన్.. డోక్లాంపై భారత్ నిఘా

China s foreign minister hopes doklam won t repeat calls for long term solution

India-China, Congress, BJP, Narendra Modi, Doklam standoff India, China, doklam, standoff, PM Modi, Wang Yi, sushma swaraj, sonia gandhi, manmohan singh, manish tiwari, India, China, doklam, People's Liberation Army, troops, sovereignty, Jinping, BRICS Summit

China's Foreign Minister sought to play down the two-and-a-half-month stand-off, saying it was "settled" and that it was "natural" for both countries to face problems in their relations.

అవే కుట్రపూరిత వ్యాఖ్యలు చేసిన డ్రాగన్.. డోక్లాంపై భారత్ నిఘా

Posted: 08/30/2017 03:36 PM IST
China s foreign minister hopes doklam won t repeat calls for long term solution

డోక్లాం నుంచి భార‌త్‌, చైనా ఆర్మీ ఆకస్మాత్తుగా తమ బలగాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ హర్షం వ్యక్తం చేశాయి. కాగా ఇది ముమ్మాటికీ భారత్ విజయమని దాయాధి పాకిస్థాన్ మీడియాతో పాటుగా ప్రపంచ మీడియా అంతా కోడై కూసినా.. డ్రాగన్ దేశం మాత్రం తన బుద్దిని మార్చుకోవడం లేదు. అసలు డోక్లాం వివాదం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుందోనన్న ప్రశ్నకు ఎలాంటి బదులివ్వాలో కూడా తెలియకపోవడంతో.. కుడిదిలో పడిన ఎలుకలా తయారైంది పరిస్థితి.

వివాదాస్పదమైన డోక్లాం ప్రాంతం నుంచి రోడ్డు నిర్మాణానికి వినియోగించే బుల్ డోజర్లు, ఇతర యంత్రసామాగ్రిని కూడా తరలించిన క్రమంలో ఎందుకు తరలిస్తున్నామన్న ప్రశ్నలు ఉత్పన్నం కాగానే.. ఇవి తమ దేశ ప్రజల నుంచి ఉత్పన్నమైతే ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక భారత్ పాఠాలు నేర్చుకోవాలని తన వక్రబుద్దిని బయటపెట్టి.. తామే పైచేయి సాధించినట్లుగా వ్యవహరిస్తుంది. తమ దేశ సౌర్వభౌధికారం కోసం సరిహద్దులో సైన్యంతో గస్తీ ఏర్పాటు చేస్తామని చెప్పుకోచ్చిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అధికారులు అదే సందర్భంగా ఈ విషయాన్ని కూడా స్పష్టం చేశారు.

అంత‌ర్జాతీయ చ‌ట్టాల గురించి తెలుసుకోవాల‌ని సూచించిన చైనా అర్మీ తరహాలోనే ఇవాళ తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ కూడా ఇదే రకమైన వ్యాఖ్య‌లే చేసి త‌మ బుద్ధిని బ‌య‌ట‌ పెట్టుకున్నారు. తాజాగా, మీడియాతో మాట్లాడుతుండ‌గా ఆయ‌న‌కు ఓ ప్రశ్న ఎదురైంది. డోక్లామ్ నుంచి వెన‌క్కిత‌గ్గి చైనా త‌న ప‌రువు కాపాడుకుందా? అని మీడియా ఆయ‌న‌ను ప్ర‌శ్నించింది. దీనికి ఆయ‌న స‌మాధాన‌మిస్తూ డోక్లాం స‌మ‌స్య భార‌త ఆర్మీ గీత దాట‌డం వ‌ల్ల త‌లెత్తిందని అన్నారు. ప్ర‌స్తుతం ఆ సమ‌స్య తొల‌గిపోయింద‌ని అన్నారు. మీడియాలో ఎన్నో పుకార్లు వ‌స్తాయ‌ని వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. తాము అధికారికంగా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌నే వాస్త‌వమని అన్నారు.

డోక్లాంపై ప్రతిష్టంభన వీడిన నేపథ్యంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగానే వుంది. డోక్లాం ప్రాంతం నుంచి సైనిక బలగాలను ఆర్మీ ఉపసంహరించుకోవడం మంచిదేనని అయితే భవిష్యత్తులో మళ్లీ చైనా ఈ ప్రాంతంలో కానీ మరే ఇతర భారత భూభాగంలో కానీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టదని హామీ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఈ మేరకు అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు ఆర్మీ నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతోనే తాను ఈ ప్రశ్నలను సంధిస్తున్నానన్నారు.

అయితే ఈ ప్రశ్నలపై స్పందించని కేంద్రం.. డోక్లాం విషయంలో మాత్రం చైనాను పూర్తిగా నమ్మినట్టు లేదు. తమ గస్తీ కొనసాగుతుందని చైనా చెప్పిన నేపథ్యంలో.. ఇటు భారత్ కూడా సరిహద్దులో సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం ఔట్‌ పోస్టుల వద్ద భారత జవాన్లను కాపలాఉంచింది. చైనా సైన్యం కదలికలపై డేగ కన్ను వేసేందుకు అనువుగా ఎత్తైన ప్రాంతంలో భారత సైనికులు గస్తీ కాస్తున్నారు. ట్రైజంక్షన్‌ లోని డోక్లాంకు 500 మీటర్ల దూరం ఈ ఔట్ పోస్టు వుంది. చైనా నుంచి ఎలాంటి కదలికలు కనిపించినా రంగంలోకి దిగేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందన్న సంకేతాలను మాత్రం కేంద్రం వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India-China  Congress  BJP  Doklam standoff India  China  doklam  standoff  PM Modi  Wang Yi  

Other Articles