DMK will meet president, says MK Stalin గవర్నర్ చేత కేంద్రం రాజకీయాలు చేస్తుంది..

Tamil nadu governor indulging in politics alleges stalin

amrutha, J Jayalalithaa, Sasikala, TN Governor, Vidyasagar Rao, TTV. Dinakaran, Dravida Munnetra Kazhagam, MK Stalin, Ramnath Kovind, Tamil Nadu, Politics

DMK Working President MK Stalin accused Tamil Nadu Governor C Vidyasagar Rao of indulging in politics and said the party and its allies will meet President Ram Nath Kovind.

గవర్నర్ చేత కేంద్రం రాజకీయాలు చేస్తుంది..

Posted: 08/30/2017 07:25 PM IST
Tamil nadu governor indulging in politics alleges stalin

తమిళనాడు గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్ రావు చేత కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేయిస్తుందని అరోపించారు. తమిళనాడు నెలకొన్న రాజకీయ అనిశ్చిత వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం వుందని రాష్ట్రంలోని చిన్నపిల్లాడికి కూడా అర్థమైందని విమర్శించారు. అడ్డదారిలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపి పార్టీ ప్రయత్నాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.

తమిళ రాజకీయాలలో సంక్షోభం సృష్టించడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని తాము మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. కలసి వచ్చిన విపక్ష పార్టీలతో పాటు ఆయన ఇవాళ గవర్నర్ విద్యాసాగర్ రావును కలసిన తరువాత మీడియాతో మాట్లాడుతే గవర్నర్ రాజ్యంగ పరిరక్షకుడిగా వుండాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారని అరోపించారు. సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు అనుమతించాలని గవర్నర్ కోరారు.

తమిళనాడు రాజకీయాలలో నెలకోన్న అనిశ్చితి నేపథ్యంలో గురువారం భాగస్వామ్య పార్టీలతో కలసి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నట్టు చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత కూడా తమిళనాడు ప్రభుత్వం చర్య తీసుకోకుంటే, కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు రాజ్ భవన్‌ చుట్టూ తిరిగిన తమిళ రాజకీయం ఇప్పుడు హస్తిన చేరనుంది. అంతకుముందు తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నాడీఎంకే తిరుగుబాటు నేత దినకరన్ కు షాకిచ్చారు.

ఎడపాటి పళనిస్వామి ప్రభుత్వానికి మోజారిటీ లేదని ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బల నిరూపణకు ఆదేశించాలంటూ గవర్నర్ ను కలసిన ఆయనకు షాక్ తగిలింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలంతా ఇంకా అన్నాడీఎంకే పార్టీలోనే కొనసాగుతున్నారని, ఈ తరుణంలో బల నిరూపణకు తాను ఆదేశించలేనంటూ విద్యాసాగర్ రావు స్పష్టం చేసినట్టు 'విదుదలై చిరుతైగల్ కట్చి' నేత తురుమవల్లవన్ తెలిపారు. మరోవైపు సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌ సెల్వం తమపై తప్పుడు ప్రచారం చేసేందుకే కేంద్ర మంత్రులను కలుస్తున్నారని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  Sasikala  Vidyasagar Rao  TTV. Dinakaran  MK Stalin  Ramnath Kovind  Tamil Nadu  Politics  

Other Articles