China's PLA hails resolution in Doklam standoff డ్రాగన్.. బ్రిక్స్ దేశల సదస్సు కోసమే తలవంచిందా..?

China s pla hails resolution in doklam standoff

India, China, doklam, standoff, People's Liberation Army, troops, sovereignty, Jinping, BRICS Summit

China's People's Liberation Army has welcomed the resolution of the two-and-a-half-month-long stand-off at Doklam, but told India to "draw lessons" from the same and said it would stay "vigilant" and "defend its sovereignty".

డ్రాగన్.. బ్రిక్స్ దేశల సదస్సు కోసమే తలవంచిందా..?

Posted: 08/29/2017 05:21 PM IST
China s pla hails resolution in doklam standoff

యుద్దానికి మేము సిద్దం అన్నట్లుగా సంకేతాలను పంపి.. దాదాపుగా 70 రోజుల తరువాత ఇన్నాళ్లకు చైనా మెట్టుదిగింది. డోక్లాం ప్రతిష్ఠంభనకు ఇన్నాళ్లు ఉన్న మంకుపట్టుకు అకస్మాత్తుగా చైనా ఎందుకు తెర దించింది? డోక్లాం ప్రాంతంలో రోడ్డు నిర్మాణం ప్రారంభించిన డ్రాగన్ దేశం.. ఒక్కసారిగా రోడ్డు నిర్మాణ యంత్ర సామాగ్రిని ఎందుకు వెనక్కి తరలించింది.? చైనా వెనక్కి తగ్గడానికి గల కారణాలే ఏంటి? అన్నది ఇప్పుడు అందరిలోనూ తలెత్తిన సందేహాలు. దీనిపై విదేశీ వ్యవహారాల నిపుణులు మాత్రం క్లారిటీ ఇస్తున్నారు. అందుకు చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ దేశాల సదస్సే కారణమా...? అంటే అవునన్న సంకేతాలే వినబడుతున్నాయి.

సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు చైనాలోని జియామెన్‌ లో బ్రిక్స్‌ దేశాల సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు భాగస్వామ్యం వహించనున్నాయి. ‘మెరుగైన భవిష్యత్తుకు బలమైన భాగస్వామ్యం’ అనే థీమ్‌ తో నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న చైనా.. భారత్ సరిహద్దులో డోక్లాం టెన్షన్ పెట్టుకుని ఈ ధీమ్ ఎలా ముందుకు తీసుకువెళ్తార్న ప్రశ్న సదస్సులో సభ్యదేశాలు ప్రశ్నించిన పక్షంలో బదులిచ్చేందుకు ఇబ్బందులు పడాల్సిన నేపథ్యంలోనే డ్రాగన్ వ్యూహాత్మకంగా ఇండిమా ముందు తలవంచిదని విదేశీ వ్యవహరాల నిపుణులు భావిస్తోంది.

కాగా, డోక్లాం నుంచి సైనికులను, రోడ్డు నిర్మాణ యంత్రసామాగ్రిని ఉపసంహరించుకున్న ,చైనా.. ఇప్పటికీ తన తీరును మార్చుకోవడం లేదు. ఇన్నాళ్లు యుద్దానికి రంకెలు వేసిన చైనా, అకస్మాత్తుగా వెనక్కుతగ్గినా.. త‌మ‌దే పై చేయి అనేలా ప్ర‌వ‌ర్తిస్తోంది. డోక్లాం ప్ర‌తిష్టంభ‌న ఘ‌ట‌న నుంచి భార‌త్ పాఠాలు నేర్చుకోవాల‌ని వ్యాఖ్య‌లు చేసింది. త‌మదేశ సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకునేందుకు స‌రిహ‌ద్దుల్లో త‌మ ఆర్మీ గ‌స్తీ నిర్వ‌హిస్తూనే ఉంటుంద‌ని పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన అధికారి అన్నారు. దేశ స‌రిహ‌ద్దుల్లో శాంతిపూరిత వాతావ‌ర‌ణం కొనసాగేందుకు తాము కృషిచేస్తూనే ఉంటామ‌ని చెప్పుకొచ్చారు. భారత్ అంత‌ర్జాతీయ చ‌ట్టాల క‌నీస సూత్రాలు తెలుసుకోవాల‌ని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  China  doklam  standoff  People's Liberation Army  troops  sovereignty  Jinping  BRICS Summit  

Other Articles