నేటి నుంచే జియో ఫోన్లు బుకింగ్.. ఎలా చేసుకోవాలంటే... | Jio Phone Bookings Online and Offline

Jio phone booking will start at 5pm on august 24

JioPhone, JioPhone Free Phone, JioPhone, Reliance Jio Free Phone, Jio Phone Booking Method, Jio Phone Booking Process

Reliance Industries AGM on 21st July 2017 is available to customers at an effective price of zero, ie, effectively free. Customers are required to pay a fully refundable, one-time, security deposit of Rs 1,500 against every JioPhone to avoid potential misuse. The JioPhone will be distributed on a ‘first come first serve’ basis to only those who pre-book starting 24th August, 2017.

జియో ఫోన్లు.. టైం వచ్చేసింది

Posted: 08/24/2017 08:59 AM IST
Jio phone booking will start at 5pm on august 24

టెలికాం రంగంలో సంచలనానికి తెరలేపుతూ ఫ్రీ ఫీచర్ ఫోన్ ను రిలయన్స్ జియో అందించేందుకు సిద్ధమైపోయిన విషయం తెలిసిందే. ముందుగా చెప్పినట్లే నేడు(ఆగష్టు 24) బుకింగ్ లు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5:30 గంటల నుంచి మై జియో యాప్‌తోపాటు, జియో డాట్‌కామ్ ద్వారా ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు.

అయితే 1500 రూపాయిలు డిపాజిట్ చేయాలని సంస్థ కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుకింగ్ సందర్భంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుందని, మిగతా వెయ్యిరూపాయలు డెలివరీ సమయంలో చెల్లించవచ్చని తెలిపింది. మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకోవచ్చని వివరించింది(మధ్యలో తీసుకునే వెసులుబాటు కల్పించవచ్చనే చెబుతున్నా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు). ముందస్తు బుకింగ్ లు ఎవరు చేసుకుంటే వారికే త్వరగతిన ఫోన్ డెలివరీ చేస్తామని ఇప్పటికే జియో ప్రకటించింది కూడా.

కాగా, పేరుకు ఇది ఫీచర్ ఫోనే అయినా, దీంట్లో స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న అన్ని సదుపాయాలు ఉంటాయి. అన్ని రకాల యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. సినిమాలు చూసుకోవచ్చు. వీడియో కాల్స్ చేసుకోవచ్చు. యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక ఆఫ్‌లైన్‌‌లో జియో రిటైల్ స్టోర్లు, మల్టీ బ్రాండ్ డివైజ్ రిటైలర్లు, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ‘జియో ఫోన్’ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే ఖచ్ఛితంగా నెల నెలా రీఛార్జీ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది.

Jio Phone Booking Process

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance  JioPhone  Free Phone  

Other Articles