నంద్యాల పీఠం ఎవరిదో? కాయ్ రాజా కాయ్.. | Huge Betting on Nandyal By Election Results

Nandyal by election result betting continues

Nandyal By Election, Nandyal By Election Results, Nandyal By Election Victory, Nandyal By Election Bet, Nandyal By Election Results, TDP YSRCP Nandyala Bet

Nandyal By Election Over. Huge Betting on Results who won. TDP and YSRCP Full Confidence on Victory.

నంద్యాల రిజల్ట్ పై జోరుగా ఊహాగానాలు

Posted: 08/24/2017 09:22 AM IST
Nandyal by election result betting continues

రెండు దశాబ్దల తెలుగు రాజకీయాల చరిత్రను తిరగరాస్తూ భారీ స్థాయిలో పొలింగ్ శాతం నంద్యాల ఎన్నికల్లో నమోదు కావటం చూశాం. దీంతో గెలుపు ఎవరివైపు అన్న అంశం ఆసక్తికరంగా మారింది. దానికి తగ్గట్లే ఇప్పుడు అక్కడ భారీ స్థాయిలో బెట్టింగ్ లు జరుగుతున్నాయి.

ఎవరికి వారే విజయం తమదంటే తమదేనని ప్రకటించుకోవటం, ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తామంటూ శపథాలు చేయటంతో మొదలైన బెట్టింగ్ తర్వాత ఆకాశాన్ని అంటాయి. ఉదయం నుంచే ఓటర్లు బారులుతీరటం, ఓటింగ్ శాతం పెరగటం నేపథ్యంలో ఎవరిని విజయం వరిస్తుందన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ మద్దతుదారుల కంటే వైఎస్సార్సీపీ మద్దతుదారులు దూకుడు ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది.

పోలింగ్ ముందు వరకు రూపాయికి రూపాయిగా సాగిన బెట్టింగ్ లు పోలింగ్ ముగిసిన అనంతరం టీడీపీ గెలిస్తే రూపాయిన్నర ఇస్తామని వైసీపీ మద్దతు దారులు పేర్కొనడం గెలుపుపై వారి విశ్వాసాన్ని చూపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు పెరిగిందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతుండగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే పోలింగ్‌ పెరిగిందని టీడీపీ మద్దతు దారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ ల రూపంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyal By Election  Huge Betting  Telugu Desam Party  YSR Congress Party  

Other Articles