police file case against Ys Jagan in 3 Town police station నంద్యాలలో వైసీపీ అధినేత జగన్ పై కేసు

Police file case against ys jagan in 3 town police station

YS jagan, three town police station, nandyal police, nandyal police file case against jagan, nandyal by polls shedule, nandyal by polls notification, nandyal by polls date, nandyal by polls counting, nandyal, assembly, by-polls, by-elections, election comission, TDP, YSRCP, bhuma nagi reddy, election news

police file case against YSRCP president Ys Jagan in 3 Town police station according to the directions issued by state election commision

నంద్యాలలో వైసీపీ అధినేత జగన్ పై కేసు

Posted: 08/23/2017 05:13 PM IST
Police file case against ys jagan in 3 town police station

నంద్యాల‌లో ఉప‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై తీవ్రంగా స్పందించింది. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ చంద్ర‌బాబుని కాల్చేయాల‌ని, ఉరితీసినా త‌ప్పులేద‌ని, అతని చోక్కా విప్పుతామంటూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ు ఎన్నికల ప్రవర్తనా నిమయావళి ఉల్లంఘన కిందకు వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జగన్ వ్యాఖ్యలపై పై అభ్యంత‌రం తెలుపుతూ ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేసిన క్రమంలో వాటిని పరిశీలించిన తరువాత సీఈసీ.. ప్రతిపక్ష నేతపై కేసు నమోదు చేయాలని పోలీసులను అదేశించింది.

ఈ వ్యాఖ్యలపై గతంలోనే వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చాడు. గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక హామీలను ఇచ్చి.. వాటిలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదని, బాబు ఇవ్వలేదు, నిరుద్యగో భృతి కల్పించలేదు.. రైతు రుణాల మాఫీ చేయలేదు.. డ్వాక్రా సంఘాల మాఫీని పూర్తిగా చేపట్టలేదు.. ఇలా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ.. అబద్దపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారన్న అవేధనతోనే అలా అన్నానని, అంతేకానీ తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశ్యం లేదని ఎన్నికల సంఘం అధికారులతో చెప్పారు.

అయినా జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లడంతో.. వాటిని పరిశీలించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆయ‌న‌ వ్యాఖ్య‌లు క‌చ్చితంగా నిబంధ‌న‌ల‌ ఉల్లంఘ‌న‌ల కిందకే వస్తాయని పేర్కొంది. జగన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని అదేశించిన నేపథ్యంలో నంద్యాల త్రీ టౌన్ పోలీసులు జగన్ పై కేసు నమోదు చేశారు. అయనపై ఐపీసీ 188, 504, 506 ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం 125 ప్ర‌కారం కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు.      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  nandyal 3 town police station  nandyal  assembly  by-polls  election comission  TDP  YSRCP  

Other Articles