భారతీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ముస్లిం చట్టాల్లోని వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ తెలిపింది. ఆరు నెలల పాటు ట్రిపుల్ తలాక్ పై స్టే విధిస్తున్నామని, ఈలోగా పార్లమెంట్ లో అవసరమైన సవరణ చేసి కొత్త చట్టం తేవాలని పార్లమెంటు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
అంతవరకూ తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ, ఇంజక్షన్ ఆర్డర్ వేసింది. కేసులో తాము కల్పించుకోవాలన్న ఉద్దేశం లేదు. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా, తాత్కాలిక ఆదేశాలు ఇస్తూ, నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ కే వదిలేస్తున్నాం అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఆర్టికల్ 14, 21 ను ట్రిపుల్ తలాక్ ఉల్లంఘించట్లేదని, రాజ్యంగబద్ధత చెల్లుబాటు కాదనే అంశం విషయంలో జోక్యం చేసుకోబోమని తెలిపింది. కానీ, మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యను వదిలించుకోవాలని చూడటం అత్యంత హేయమైన చర్యని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఫోన్ లేదా సామాజిక మాధ్యమాల్లో తలాక్ చెప్పడం చట్ట సమ్మతం కాదని, అటువంటివి చెల్లబోవని పేర్కొంది.
కొత్త చట్టం తెచ్చేటప్పుడు ముస్లిం లాబోర్డు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంట్ కు సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ ఈ ఆరు నెలలో కొత్త చట్టం తేని యెడల తమ ఇంజక్షన్ ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇరు పక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించగా, తుది తీర్పు కోసం యావత్ దేశం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more