Saudi man divorces wife for walking ahead ఇదేం చిత్రమో: భర్త అడుగుజాడల్లో నడవలేదని..

Saudi man divorces wife for walking ahead

Supreme Court, triple talaq, verdict, Muslim Personal Law Board, divorce in islam, Saudi Arabia alarmed of divorces, triple talaq verdict, Al Watan, wedding officer, Anthropology, Lateefa Hamid, Gender, Dubai, Christian views on divorce, Saudi Arabia Divorce, social consultant, Hani Al Ghamdi, Human behavior, Family Counsellor, Marriage, Al Shimmari, sheeps head, islam, saudi arabia, new wedd couples, World News

A Saudi man divorced his wife after she kept walking ahead of him despite his repeated warnings to keep a step behind him.

ఇదేం చిత్రమో: భర్త అడుగుజాడల్లో నడవలేదని..

Posted: 08/22/2017 11:48 AM IST
Saudi man divorces wife for walking ahead

ఇస్లామిక్ దేశాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ముస్లింల అత్యంత పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలో.. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. చిన్న కారణాకలకు కూడా భర్తలు.. తమ భార్యలకు విడాకులు ఇచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ దేశంలో అమలులో వున్న త్రిపుల్ తలాక్ తో తమ భార్యలను వదిలివేసేందుకు.. ఏ మాత్రం ముందు వెనుక అలోచించకుండా యువత సిద్దమవుతున్నారు. భర్త అడుగుజాడల్లో నడవాల్సిన భార్య.. భర్త కన్నా ముందు నడిచిందన్న కారణంతో విడాకులు ఇవ్వడం అక్కడి విచిత్ర పరిస్థితులకు దర్పణం పుడుతుంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే... తన కంటే ముందు నడవొద్దని, బయటకు వెళ్తే తనను అనుసరించాలని ఎన్నిసార్లు చెప్పినా వినని భార్యకు.. భర్త ఏకంగా విడాకులు ఇచ్చి.. తనతో సంసారజీవితానికి అమె పనికిరాదని తేల్చేశాడు. అంతేకాదు భర్తకు విధేయురాలై ఉండాలని ఖురాన్ చెబుతోందని, భర్త అడుగుజాడల్లోనే నడవాలని సూచిస్తుందని.. దాని ప్రకారం నడవడం లేదేమని కూడా ప్రశ్నించాడు ఆ భర్త. దీంతో తాను తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నానని అరోపిస్తూ అమెకు విడాకులు ఇచ్చేశాడు.

భర్తను అనుసరించడం.. భర్త అడుగుజాడల్లో నడవటం అంటే.. భర్త వెనకాలే నడవడమా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటనలు సౌదీ అరేబియాలో ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతున్నాయని, వివిధ కారణాలను చూపుతున్న నూతన వరులు.. తమ భార్యలకు విడాకులిస్తున్నారని, ఈ సంఖ్య గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరుగుతుందని ఇదే ప్రమాదస్థాయికి చేరుకునే లోపు కాబోయే వధూవరులకు కుటుంబసభ్యులు తమ సంసార జీవితంలో ఎలా మెలగాలో నేర్పించాల్సిన అవసరముందని అధికారులు పేర్కొన్నారు.

ఇక ఇప్పటికే విడిపోయిన నవ జంటల విషయంలో అటు ప్రభుత్వం.. ఇటు తల్లిదండ్రులు కూడా వారిని కౌన్సిలింగ్ కేంద్రాలను పంపించి.. వారు తమ జీవిత భాగస్వామి విషయంలో ఎలా మెలగాలి, వారి తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలి అన్న విషయాలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ చిన్న, చితక కారణాలను చూపుతూ సౌదీ అరేబియాలో గత మూడు నాలుగేళ్లుల్లో విడాకులు పోందిన వారి సంఖ్య ప్రమాద ఘంటికలను మోగ్రిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక మరో ఘటనలో ఓ వ్యక్తి తన స్నేహితులకు తన ఇంట్లో విందును ఏర్పాటు చేయగా, తన భార్య విందు సంప్రదాయాలలో భాగంగా మేక తలను ముందుగా డైనింగ్ టేబుల్ పై పెట్టకుండా అన్ని వడ్డించిన తరవాత మేక తలను తీసుకురావడంతో అగ్రహంతో ఊగిపోయిన భర్త.. తన స్నేహితులు వెళ్లిపోగానే.. అమెపై పైకప్పు విరిగిపోయేలా పెద్దగా అరచి.. ఆ తరువాత విడాకులు ఇచ్చాడని కూడా అధికారులు చెప్పారు. ఇంకో వ్యక్తి తాను చెప్పినా వినకుండా తన భార్య కాళ్లకు పట్టీలు వేసుకుని హానీమూన్ కు రావడంతో.. అమెకు అదే సమయంలో ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. ఈ తరహా విడాకులే ఇప్పుడు అ దేశంలో హాట్ టాపిక్ గా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles