twitterites troll Piyush Goyal over fake photo స్వదేశం అంటే చేదా..? లేక అలవాటా..?

Piyush goyal passes off photo of russian street as indian deletes tweet later

piyush goyal tweet, piyush goyal tweet street lighting, piyush goyal tweet street russia, piyush goyal photo indian street russia, Piyush Goyal, Power minister, Streetlights, SM Hoax Slayer, Union Minister, Wrong Photo Tweet, LED lights, BJP

Piyush Goyal, MoS for Power, Coal, New and Renewable Energy and Mines tweeted a photo about Government of India's Street Lighting National Programme.

స్వదేశం అంటే చేదా..? లేక అలవాటా..?

Posted: 08/21/2017 05:58 PM IST
Piyush goyal passes off photo of russian street as indian deletes tweet later

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక్కసారిగా నరేంద్రమోడీకి హైప్ తీసుకురావడంలో..  సోషల్ మీడియా అత్యంత కీలక పాత్ర పోషించింది. నరేంద్రమోడీ మంత్రంతో యావత్ అంతర్జాల ప్రపంచం తన్మయంలో మునగడానికి బీజేపి నేతలు, పార్టీ శ్రేణులు నెట్టింట్లో పెట్టిన ఫోటోలు, వీడియోలే కారణం. అంతేకాదు ఓ వైపు మోడీని హైలైట్ చేస్తూనే.. మరోవైపు ప్రత్యర్థి వర్గంలో కీలకమైన నేత రాహుల్ గాంధీపై విమర్శల ఎక్కుపెట్టడం కూడా కారణమే. ఈ మేరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనుసరించి వ్యూహాల్లతో నెట్ జనులు తమను తాము నమో మంత్రంలో మునిగిపోయేట్లు చేసింది.

అయితే ఎన్నికలకు ముందు నరేంద్రమోడీని హీరోలా చూపిన సోషల్ మీడియా.. అప్పట్లో అయన చేయని మంచి పనులు కూడా చేసినట్లు ప్రచారం చేసినా.. దానిని ఎవరూ పట్టించుకోలేదు. ఇక పలు బీజేపి నేతలు తప్పులు చేసినా.. మోడీ మానియా ముందు అవి కొట్టుకుపోయాయి. కానీ ఎన్నికలు పూర్తైన తరువాత.. బీజేపి నేతలు పెట్టిన పోస్టులే కాదు ఏకంగా కేంద్రమంత్రులు పెట్టిన పోస్టులుపై కూడా నెట్ జనులు తీవ్రంగా పరిశీలించిన తరువాత కానీ కామెంట్ చేయడం లేదు.

ఇక ఏదో సాదరాణ వ్యక్తులు పెట్టిన పోస్టులు కూడా అవి తప్పని తేలిస్తే ఏ మాత్రం మోహమాటానికి వెళ్లని నెట్ జనులు ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ కుండ బద్దలుకొడుతున్నారు. సోషల్ మీడియా ఓ వైపు తన ఉనికిని మరింత పెంచుకుంటూ.. ఇప్పుడు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగస్వామిగా మారిపోయింది. విషయం ఏదైనా సరే.. క్షణాల్లో అందరికీ చాటిచెప్పేందుకు సోషల్ మీడియా వేదికగా మారుతుంది. ఈ విషయంలో అడుగుముందుకేసిన బీజేపి ఎంత ఎక్కువ మంది ఫాలోవర్లు వుంటూ అదేస్థాయిలో వాళ్లకు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు దక్కే అవకాశాలు కూడా వుంటాయని చెప్పిందంటే.. సోషల్ మీడియా ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ క్రమంలో దొరితే తప్పులు వారి పరువును తీసిపడేస్తున్నాయి. ఎన్నికల తరువాత అనేక అంశాలలో బీజేపి నేతలు సోషల్ మీడియా వేదికగా తమ పరువును పొగొట్టుకున్న ఘటనలు వున్నాయి. గతంలో కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో రాజ్‌ కోట్‌ లోని ఓ బస్‌స్టాప్‌ ఫోటోను అప్పుడే ఆవిష్కరించినట్లు తప్పుడు ట్వీట్‌ చేసి విమర్శల పాలవ్వగా, బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ 2002 గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ఓ ఫోటోను బెంగాల్‌ అల్లర్లకు చెందిందంటూ షేర్‌ చేసి విమర్శలపాలయ్యాడు. ఆ తరువాత కూడా అనేక మంది బీజేపి నేతలు ఇలాంటి ట్విట్లతో తమ పరువును కోల్పోయారు.
 
ఇక తాజాగా, కేంద్ర సహాయ మంత్రి పీయూష్‌ ఘోయల్‌ కూడా సోషల్ మీడియా ద్వారా తన పరువుకు పంగనామాలేట్టేశారు. జాతీయ వీధి దీపాల మిషన్‌ కార్యక్రమంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం 50,000 కిలోమీటర్ల రహదారులను కొత్తగా ఎల్‌ఈడీ లైట్లతో అమర్చినట్లు కొత్త భారత్ ను అవిష్కరించినట్లు ఆయన పోస్ట్‌ చేశారు. దానిని ఫోటో రూపంలో చూపేందుకు భారత్ దేశంలోని ఫోటోకు బదులు రష్యా దేశానికి చెందిన ఫోటోను ట్వీట్‌ చేయడంతో ఆయనను పలువురు నెట్ జనులు ఏకీపడేశారు. వెంటనే తన తప్పును గమనించిన పీయూష్‌ తర్వాత ఆ ఫోటోను డిలీట్‌ చేసి మన వీధులకు చెందిన ఫోటోను తిరిగి ట్వీట్‌ చేశారు. అంతేకాదు సోషల్‌ మీడియా వల్ల ఇలాంటి తప్పులు కూడా సవరించుకునే వీలు కలుగుతుందంటూ తన తప్పును సర్దిపుచ్చుకునే యత్నం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Piyush Goel  street lighting  Wrong Photo Tweet  LED lights  BJP  India  Russia  

Other Articles