వార్ విషయంలో వెనక్కి ఎందుకు తగ్గుతోంది? | North Korea Back Step in Nuclear War with USA

Military drills with south korea warns us

North Korea, North Korea Merciless Strike, North Korea Warn America, North Korea South Korea America, America South Korea Joint Operation

North Korea threatens ‘merciless strike’ over U.S.-South Korea military exercises. US military drills with South for past 10-days in Part of joint military exercise.

ఉత్తర కొరియా టార్గెట్ మారిందా?

Posted: 08/21/2017 09:38 AM IST
Military drills with south korea warns us

అణు క్షిపణులు, వాటి పరీక్షలతో అమెరికాను వణికిస్తున్న కిమ్ జంగ్ మరోసారి అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణకొరియాతో అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారిక పత్రిక రోడాండ్ సిమోన్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. అందులో ఫసిపిక్ తీరంలోని గువామ్ దీవి తమ లక్ష్యం కాదంటూ ఉత్తరకొరియా స్పష్టం చేసింది.

దక్షిణ కొరియాతో కలిసి అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు తక్షణమే ఆపేయాలని అందులో హెచ్చరించింది. లేదంటే అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. గువామ్ పై దాడి చేస్తామని ప్రకటించినప్పటికీ దానిని విరమించుకున్నామని, అయితే తాము ఎక్కడ? ఎలా? ఎప్పుడు? దాడి చేస్తామో ఎవరూ ఊహించలేరని తెలిపింది. అమెరికా ఏం చేస్తుందో గమనించిన తరువాత అణుదాడి చేద్దామని కిమ్ నిర్ణయించారని, అందుకే తాము దాడి చేయలేదని ఆ కథనం తెలిపింది.

దీనిని అవకాశంగా తీసుకున్న అమెరికా తన ఆయుధ సంపత్తితో తమను భయపెట్టాలని చూసిందని, అది జరిగేపని కాదని తెలిపింది. అమెరికా ముందు తలవంచడమన్నది కలలో కూడా జరిగే పని కాదని ఆ పత్రిక స్పష్టం చేసింది. కాగా, ఉత్తరకొరియాపై నిఘా కోసం శక్తిమంతమైన కెమెరాలు, రాడార్లు, సెన్సర్లు కలిగిన ప్రత్యేక యుద్ధ విమానం 'డ్రాగన్ లేడీ'ని రంగంలోకి దించిన సంగతి తెలిసిందే.

'డ్రాగన్ లేడీ'...

ఉత్తరకొరియా రాడార్లు కనిపెట్టలేనంత ఎత్తులో అంటే సుమారు 70 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ అది పహారా కాస్తుంది. నేటి సాయంత్రం అది జపాన్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరనుందని అమెరికా సైన్యం తెలిపింది. చాలా ఎత్తులో ఈ విమానాన్ని నడపవలసి ఉండడంతో ఇందులోని పైలెట్లు వ్యోమగాములు ధిరించేటటువంటి దుస్తులను ధరిస్తారని అమెరికా సైన్యాధికారులు తెలిపారు. అంతర్జాతీయ ఒత్తిడితోనే ఉత్తర కొరియా దాడిని వాయిదా వేసిందని, దాడిని రద్దు చేసుకోలేదని అమెరికా సైన్యం అనుమానిస్తోంది. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించే సమయంలో ఉత్తరకొరియా తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని, దీంతో అది తీవ్ర నిర్ణయం తీసుకుంటే ముందుగానే గుర్తు పట్టాల్సిన బాధ్యత తమపై ఉందని అమెరికా సైన్యం చెబుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా ఉత్తరకొరియాపై నిఘా కోసం అత్యంత శక్తిమంతమైన కెమెరాలతో పహారా కాసేందుకు డ్రాగన్ లేడీని రంగంలోకి దించామని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : North Korea  USA  Nuclear War Warn  

Other Articles

Today on Telugu Wishesh