వెంకయ్య యాడ్లు.. టీ సర్కార్ పై తీవ్ర విమర్శలు | Criticism on Telangana Govt New Ad

Vp venkaiahnaidu felicitating by telangana government

Telangana, Telangana Government Felicitating Venkaiah Naidu, Venkaiah Naidu Felicitated by Telangana Government, Felicitating Venkaiah Naidu Ads, Felicitating Ads, Telangana Government Ads

TS Govt's full page ad felicitating Vice President Venkaiah Naidu faces backlash. posters facilitating Venkaiah Naidu or even supporting Ram Nath Kovind’s candidature are to be rightly seen as mere propaganda.

వెంకయ్యకు సన్మానం.. తీవ్ర దుమారం

Posted: 08/21/2017 10:02 AM IST
Vp venkaiahnaidu felicitating by telangana government

తెలంగాణలో ఈ ఉదయం పత్రికల ఫ్రంట్ పేజీల్లో వచ్చిన ఓ యాడ్ పాఠకులకు చిరాకు తెప్పించిందనే చెప్పుకోవాలి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తొలిసారి హైదరాబాద్ విచ్చేయుచున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరపున పౌర సన్మానం ఏర్పాటు చేసినట్లు అందులో ఉంది. ఇది ప్రభుత్వం తరపున యాడ్ కావటంతో సాధారణ ప్రజలకు కోపం తెప్పించటంలో తప్పేం లేదనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా ఇలాంటి యాడ్ లు నేతల విషయంలో, రాజకీయ పంక్షన్ లకు కనిపిస్తుంటాయి. సొంత డబ్బును ఖర్చుపెట్టుకుని మరీ కొందరు ఇలా డబ్బాలు కొట్టించుకుంటారు. అయితే ఏ పార్టీతో సంబంధం లేని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల విషయంలో ఓ ప్రభుత్వం అడ్వటైజ్ మెంట్లతో పేరుతో ప్రజా సొమ్మును వృథా చేయటం సరికాదనే వాదన తెరపైకి వస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము అమలు చేసే పథకాలను ఇలా ఫ్రంట్ పేజీల్లో యాడ్ రూపంలో ఇచ్చే సమయంలోనూ టాక్స్ చెల్లించే ప్రతీ ఒక్కరికీ మండిపోవటంలో అర్థం ఉందన్నది వారు చెబుతున్న మాట.

కాగా, సోమవారం ఉదయం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున రాజ్ భ‌వ‌న్ లో వెంకయ్య నాయుడుకు పౌర స‌న్మానం చేయ‌నున్నారు. ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య కార్యక్రమం జరగనుంది. న‌గ‌రంలోని దిల్ కుషా అతిథి గృహం ప్రాంగ‌ణంలో ఆరోజు వెంక‌య్య నాయుడు గౌర‌వార్థం విందును ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సీఎం తెలిపారు. రేపు ఉదయం ఆయన తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Vice President Venkaiah Naidu  Felicitating Ads  

Other Articles