Complete solar eclipse to sweep width of US after 99 years వందేళ్ల తరువాత ఇవాళ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం..

Complete solar eclipse to sweep width of us after 99 years

NASA, Solar eclipse, Total Solar Eclipse, Partial solar eclipse, How to view a solar eclipse, Safety tips for viewing eclipse, Solar eclipse safety measures, August 21 solar eclipse, 99 years, Total solar eclipse, August 21, celestial spectacle, sun, moon, earth, Space news

The solar eclipse that is about to occur today, in 14 states across the continental United States has many people looking forward to the event

వందేళ్ల తరువాత ఇవాళ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం..

Posted: 08/21/2017 08:19 AM IST
Complete solar eclipse to sweep width of us after 99 years

అగ్రరాజ్యం అమెరికా వాసులు పనిగట్టుకుని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. మరికొన్ని గంటల వ్యవధిలో ఖగోళంలో చేటుచేసుకునే అద్భుత సన్నవేశాన్ని వీక్షించేందుకు అమెరికా వాసులతో పాటు మరికొన్ని దేశాలు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్నారు. పట్టపగలు చిమ్మచీకట్లు అలుముకునే ఈ అద్భుతం కోసం గత రెండు నెలల ముందే అగ్రరాజ్యవాసులు అన్ని ఏర్పాట్లను చేసుకున్నారంటే.. ఈ ఖగోళ అద్భుతాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని, ఎట్టి పరిస్థితుల్లో ఈ అద్బుతాన్ని వీక్షించేందుకు సిద్దమయ్యారు. ఖగోళ అద్భుతం నేపథ్యంలో ఇవాళ అగ్రరాజ్యంలో పాఠశాలలకు సెలవు దినాన్ని ప్రకటించారు. ఇక మరికొందరు స్వచ్చందంగా ముందస్తు సెలవులను పెట్టుకుంటున్నారు. ఇదంతా ఎందుకు అంటారా..? ఆగస్టు 21న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది.

మనిషి జీవితకాలంలో ఒకసారి మాత్రమే కనిపించేలా.. దాదాపు 99 ఏళ్ల తరువాత మొట్టమొదటి సారి సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుండటంతో అందరూ.. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యవాసులు తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో పాక్షికంగా కనిపించనున్న సూర్యగ్రహణం అమెరికా ఖండంలోని 14 రాష్ట్రాల మీదుగా ఏర్పడనుండటంతో వారికి సంపూర్ణంగా గ్రహణం కనిపిస్తుందని  నాసా ప్రకటించింది. ఈ సారి కనిపించే సూర్యగ్రహణం అరుదైన గ్రహణమనీ, ఖగోళ అద్భుతం మని నాసా అభివర్ణించింది.

గ్రహణ సమయంలో, సూర్యుడు, భూమి​కి మధ్య నుంచి చంద్రుడు దాటుతాడని, అ క్రమంలో ఒకవైపు సూర్యుడు మొత్తం కప్పి వేయడంతో  ఆకాశంలో సూర్యుడు కనిపించడని  పేర్కొంది. ఇవాళ మధ్యహ్నం మూడు గంటల సమయం నుంచి గ్రహణం ప్రారంభమవుతుందని, ఇది దాదాపు గంటన్నర పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. దీంతో అగ్రరాజ్యంలో మిట్టమధ్యాహ్నం కారు చీకట్లు కమ్ముకుంటాయని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ అద్భుతాన్ని వీక్షించాలని కూడా పిలుపునిస్తున్నారు.

ఈ అద్భుతమైన ఖగోళ ఈవెంట్ ను ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వీక్షిస్తారని, ఒక్క అమెరికాలోనే దాదాపుగా 30 కోట్ల మంది కన్నా ఎక్కువ మంది వీక్షించనున్నారని నాసా అంచనా వేసింది. అలాగే ఈ గ్రహణాన్ని వీక్షించాలనుకునేవారు సరైన భద్రతా ప్రమాణాలను పాటించాలని నాసా సిఫారసు చేసింది. ముఖ్యంగా ఎక్లిప్‌  గ్లాసెస్ లేదా హ్యాండ్‌ హెల్డ్‌ సోలార్ వ్యూయర్ లాంటి ప్రత్యేక ప్రయోజన సౌర ఫిల్టర్లను మాత్రమే వాడాలని సూచించింది. గ్రేట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స్ అని పిలిచే ఈ గ్రహణం భారత్ సహా పలు దక్షిణాసియా దేశాల్లో అసలు కనిపించదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 99 years  total solar eclipse  nasa  celestial spectacle  sun  moon  earth  

Other Articles