polytechnic student ragged by seniors in collage bus తీగల కాలేజీలో.. కోరలు చాచిన ర్యాగింగ్ రక్కసి

Seniors thrashed junior in collage bus and demanded rs 500 on pretext of ragging

ragging in college, ragging in polytechnic college, ragging in collage bus, seniors demand cash, seniors in collage bus, LB Nagar police Station, junior student, polytechnic sturdent LB Nagar police station, giridhar, narsimha, narsimha goud, sameer, bibinagar TDR polytechnic collage, TDR polytechnic college, seniors demand money from freshers, Ragging, LB Nagar police station, college bus, bibinagar, yadadri, Crime

In a bizzare incident a polytechnic college junior student was ragged by the seniors in the college bus. As he was unable to bear the pain he rushed into police station and complained on the seniors that they had thrashed him and demanded Rs. 500 on pretext of ragging

తీగల కాలేజీలో.. ర్యాగింగ్ పేరుతో చావుదెబ్బలు.. డబ్బు వసూళ్లు..

Posted: 08/18/2017 10:46 AM IST
Seniors thrashed junior in collage bus and demanded rs 500 on pretext of ragging

ర్యాగింగ్ రక్కసి మళ్లీ జడలు విప్పింది. కొత్తగా వచ్చే విద్యార్థులతో పరిచయం చేసుకునే నేపథ్యంలో ఫ్రెషర్లను నానా చిత్రహింసలకు గురిచేసి, వారిని మానసికంగా, శారీరికంగా అవమానపర్చి.. ఆ పరాభావాలతో వారు ఏకంగా తనువునే చాలించుకున్న ఘటనలు ఇప్పటికే అనేకం చోటుచేసుకున్నాయి. అయితే పోలీసులు, ప్రభుత్వంతో పాటు ఇటు కాళాశాల యాజమాన్యాలు ర్యాగింగ్ పై ఉక్కుపాదం మోపడంతో.. గత కొన్నాళ్లుగా ర్యాగింగ్ భూతం అడ్రస్ లేకుండా పోయింది.

కాగా, మళ్లీ మరోకొత్త రూపంలో ర్యాగింగ్ రక్కసి తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంది. కాళాశాలల్లో ర్యాగింగ్ కు పాల్పడితే యాజమాన్యమే చర్యలు తీసుకుంటుందన్న భయంతో.. కాలేజీ బస్సులో సీనియర్లు జూనియర్లపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. సినిమాల ప్రభావమో లేక.. చెడు సావాసాల ఫలితమో తెలియదు కానీ.. చదువుకుంటున్న సరస్వతీ పుత్రులు కాస్తా.. రౌడీల్లా వ్యవహరించి.. జానియర్లను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బలిస్తేనే ర్యాగింగ్ చేయమని లేదంటే ప్రతిరోజు ఇది తప్పదని హెచ్చరిస్తున్నారు.

తాజాగా సీనియర్ల ర్యాగింగ్‌ ఆకృత్యాలను తట్టుకోలేని ఓ విద్యార్థి పోలీస్‌ స్టేషన్లోకి పరుగుతీసి తాను ఎదుర్కోన్న సీనియర్ల దురాగతంపై పిర్యాదు చేశాడు. ఈ ఘటన ఎల్‌బీనగర్‌లో చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌ లింగజోడుకు చెందిన గిరిధర్‌ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లోని టీడీఆర్  పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. క్రితం రోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి కాలేజీ బస్సులో వస్తుండగా, అతన్ని ఫైనలియర్‌ విద్యార్థులు సమీర్‌, నరసింహా, నరసింహా గౌడ్‌లు ర్యాగింగ్ పేరుతో చితకబాదారు.

కాలేజీలో బస్సు ఎక్కిన కొద్దిసేపటి నుంచి సీనియర్ల దెబ్బలు మౌనంగా తట్టుకుని నిలబడ్డ గిరిధర్.. ఆ నొప్పులను భరించలేకపోయాడు. బస్సు ఎల్బీనగర్ చేరుకోగానే పోలీస్ స్టేషన్ లోకి పరుగు తీశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గాయపడ్డ గిరిధర్ ను సమీప ఆసుపత్రికి తరలించారు. ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్ విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీనియర్లు వంగబెట్టి దెబ్బలు కోట్టే గేమ్‌ తనతో ఆడారని, రూ.500 ఇస్తే వదిలేస్తామన్నారని గిరిధర్‌ సాక్షికి తెలిపాడు.

బీబీనగర్‌ నుంచి ఉప్పల్ వరకు కొట్టారని, డబ్బులు ఇవ్వకుంటే రోజు ఇలానే కొడుతామని బెదిరించినట్లు గిరిధర్‌ చెప్పుకొచ్చాడు. ఇక మరో విషయానికి వస్తే ఈ కాలేజీ అధికార పార్టీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తనయుడు తీగల దినేష్ రెడ్డి పేరుపై వుండటం.. అధికార ఎమ్మెల్యే కు చెందిన కాలేజీలోనే ఇలాంటి ఘటనలు నమోదు కావడంపై విద్యార్థులు తల్లిదండ్రలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDR polytechnic college  Ragging  LB Nagar police station  college bus  bibinagar  yadadri  Crime  

Other Articles