Want to destroy the Taj Mahal: Supreme Court asks govt కేంద్రానికి సుప్రీంకోర్టు ఝలక్.. వారసత్వ సంపదను నాశనం చేస్తారా.?

Do you want to destroy the taj mahal supreme court asks govt

Taj Mahal, Supreme Court, Agra, Deforestation, Delhi, Mathura, Delhi Mathura Railway track, Taj Mahal stretch, Union Government, affidavit, 400 trees, SC fires on union government

Supreme Court was hearing an application which has sought its nod to cut around 450 trees there in an around 80 km stretch near Taj Mahal in Agra, on which the additional railway track would be laid between Mathura and Delhi.

కేంద్రానికి సుప్రీంకోర్టు ఝలక్.. వారసత్వ సంపదను నాశనం చేస్తారా.?

Posted: 08/18/2017 10:04 AM IST
Do you want to destroy the taj mahal supreme court asks govt

ప్రపంచ ప్రఖ్యాతిగాంచి.. అద్భుత వారసత్వ సంపదగా నిలుస్తున్న అందమైన కట్టడాల్లో ఇప్పటికీ తన పేరును అగ్రభాగన నిలిపింది తాజ్ మహల్. నేటికీ ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను అకర్షిస్తున్న ఒక అద్భుత చారిత్రక కట్టడంగా నిలిచింది. ఈ విషయాలు మీకు తెలియవా..? అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. ఈ విషయాలు తెలిసి కూడా తాజ్ మహల్‌ను నాశనం చేయాలని అనుకుంటున్నారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

తాజ్‌ పరిసర ప్రాంతాలను రక్షించి అద్భుత కట్టడ అందాలను పరిరక్షించాలని కోరుతూ పర్యావరణవేత్త మెహతా.. గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర నుంచి ఢిల్లీ వరకూ అదనంగా ఏర్పాటు చేసే రైల్వే ట్రాక్‌ కోసం దాదాపు 400కి పైగా చెట్లను తొలగించనున్నారు. దాని వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలగడంతో పాటు, దాని ప్రభావం చారిత్రక కట్టడంపై కూడా పడనుంది. దీంతో ఈ విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

‘తాజ్‌మహల్‌ ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాల్లో ఒకటి. దాన్ని ప్రభుత్వం నాశనం చేయాలనుకుంటుందా? ప్రస్తుతం తాజ్‌మహల్‌ ఎలా ఉందనే దానికి సంబంధించిన ఫొటోలను అసలు చూశారా? ఆన్‌లైన్‌లో తాజ్‌ ఫొటోలు చూడండి.. ఎలా ఉందో కనిపిస్తుంది’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ మదన్‌ బీ లోకుర్‌, జస్టిస్ దీపక్‌ గుప్తాలతో కూడిన  ద్విసభ్య ధర్మాసనం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. ఒక వేళ అదే చేయాలనుకుంటూ కేంద్ర ప్రభుత్వం తాజ్ మహాల్ ను నాశనం చేయాలనుకుంటుంది అని ఓ అఫిడెవిట్ దాఖలు చేయండీ అని ధర్మాసనం అగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles