Latha Rajinikanth school locked for rental dues రజనీకాంత్ ను వెన్నాడుతున్న కష్టాలు.. దావా వేస్తానన్న లతా..

Latha rajinikanth school locked by landlord for rental due disputes

ashram, Demonetisation, Latha Rajinikanth, rajinikanth, rent default, The Ashram Matriculation School, Landlord, Rent, more trobules for rajini kanth, producers council, tamil nadu, rajini kanth news, kollywood news, latest news

The school run by superstar Rajinikanth’s wife Latha has once again run into trouble, this time due to an alleged default on payment of rent. The landlord of the premises has sealed the 'Ashram' and students would now have to shift to another campus.

రజనీకాంత్ ను వెన్నాడుతున్న కష్టాలు.. దావా వేస్తానన్న లతా..

Posted: 08/17/2017 12:14 PM IST
Latha rajinikanth school locked by landlord for rental due disputes

దక్షిణాది సూపర్ స్టార్‌ రజనీకాంత్ కు కష్టాలు వెంటాడుతూనే వున్నాయి. తాజాగా ఆయన రాజకీయ అరంగ్రేటం చేస్తానన్న సంకేతాలను వెలువరించడంతో ఈ కష్టాలు మరింతగా చుట్టుముట్టాయి. రజనీ కూతురు ఐశ్వర్య నిర్మించిన కొచ్చాడియన్ చిత్రం నుంచి ఆయన కుటుంబసభ్యులతో అయన కష్టాల కడలిని ఈదుతూనే వున్నారు. తాజాగా ఆయన సతీమణి లతా రజనీకాంత్ కూడా ఆయనకు మరిన్న కష్టాలను తెచ్చిపెట్టారు. అమె నిర్వహిస్తున్న పాఠశాలకు అద్దె బకాయిలు చెల్లించని కారణంగా స్థల యజమాని తాళం వేశారు..

చెన్నైలోని స్థానిక గిండిలో రజనీ సతీమణి లత నిర్వహిస్తున్న ఆశ్రమ్‌ విద్యాలయ భవనానికి రూ.2 కోట్ల అద్దె బకాయి పడడంతో స్థల యజమాని స్థానిక అధికారుల చేత సీజ్‌ చేయించారు. దీనితో ఈ పాఠశాలలో చదువుతున్న 300 మంది విద్యార్థులను లతా రజనీకాంత్ కు చెందిన వేళచ్చేరిలోని ఐసీఏసీ పాఠశాలకు తరలించారు. గత కొన్ని సంవత్సరాలుగా అద్దె బకాయిలు చెల్లించని కారణంగా సదరు స్థల యజమాని వెంకటేశ్వర్లు స్థానిక అధికారులను వెంటబెట్టుకుని వచ్చి పాఠశాలకు తాళం వేసి సీజ్ చేయించారు.

పాఠశాల నిర్వహిస్తున్న లతా రజనీకాంత్.. 2009 నుంచి అద్డె బకాయిలు చెల్లించలేదని అరోపిస్తూ ఆ భవనం యజమాని వెంకటేశ్వర్లు గతంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత జూన్ మాసంలో ఇరువర్గాలను చర్చలకు ఆహ్వానించింది. బకాయి పడిన మొత్తం అద్దె రూ.11 కోట్లు చెల్లించాలంటూ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అయితే అంత మొత్తాన్ని చెల్లించలేమని చెప్పిన లతా రజనీకాంత్ రూ.2 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించినట్టు తెలిసింది. న్యాయస్థానంలో అంగీకరించిన హామీని లతారజనీకాంత్ ఉల్లంఘించినందు వల్ల ఆ పాఠశాలకు తాళం వేసినట్టు వెంకటేశ్వర్లు తరపు న్యాయవాది తెలిపారు.
 
ఈ ఘటనపై స్పందించిన పాఠశాల యాజమాన్యం.. విపరీతంగా పెంచిన అద్దెలతో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, స్థలం యజమాని నుంచి అనేక ఇబ్బందులు ఎదురవడంతో ప్రస్తుతం స్థలాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించినట్టు యాజమాన్యం తెలిపింది. పైగా ఈ సమస్యను ముగించే దిశగా చర్చలు జరుగుతున్నాయని కూడా తెలిపింది. పాఠశాల స్థలం యజమాని పెట్టిన వేధింపుల కారణంగా మానసిక ఇబ్బందులకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, సిబ్బంది తరపున చట్ట ప్రకారం చర్యలు కోరుతూ న్యాయస్థానంలో దావా వేయనున్నట్టు తెలిపింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : The Ashram Matriculation School  Latha Rajinikanth  Rajinikanth  Landlord  Rent  tamil nadu  

Other Articles