WATCH: Phone falls from plane - and survives! వైరల్ వీడియో: విమానం నుంచి జారిపడిన సెల్ ఫోన్

Phone allegedly falls from plane records its 1000 foot plummet

pilot drops phone, pilot drops phone with camera on, you tube, robert ryan, blake henderson, kentucky, Samsung phones, Samsung G5 phone, Jonathan Chan, samsung, smartphones, viral video, social media

A Samsung G5 allegedly fell 1,000 feet from a private plane, and lived to tell the tale — and tell it did, thanks to its switched-on video recording function.

ITEMVIDEOS: వైరల్ వీడియో: విమానం నుంచి జారిపడిన సెల్ ఫోన్

Posted: 08/16/2017 11:16 AM IST
Phone allegedly falls from plane records its 1000 foot plummet

చేతిలోంచి మీ సెల్ ఫోన్ జారి పడితే.. అయ్యే ఏం జరిగిందో అని ఒకటికి పది సార్లు చూసుకుంటారు. కానీ ఏకంగా కిలోమీటర్ల ఎత్తు నుంచి సెల్ ఫోన్ జారిపడితే.. ఔరా తునాతునకలు కాక మరేమవుతుంది..? అంటారా.. కానీ కాదు. ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఈ ఫోన్ సురక్షితంగా వుంది. అంతేకాదు నిక్షేపంగా పనిచేస్తుంది. ఇక్కడే మీకు అంత ఎత్తు నుంచి నుంచి ఎందుకు జారిపడిందన్న అనుమానాలు కలుగుతున్నాయి కదూ.  అయితే అది పడింది ఏకంగా వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమనాం నుంచి.. ఇక అనుమానాల సంఖ్య రెట్టింపైంది కదూ..

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని టెన్నెస్సీకి చెందిన బ్లేక్ హెండర్సన్ తన చిన్నతరహా విమానంలో ప్రయాణిస్తుండగా... అతి సమీపం నుంచి వేరొక విమానం దూసుకురావడాన్ని గమనించాడు. వెంటనే తన శాంసంగ్‌ గెలాక్సీ ఎస్5 మొబైల్ ఫోన్ తీసి ఈ విమానం దృశ్యాలను చిత్రీకరించడం మొదలుపెట్టాడు. అలా ఆ విమాన దృశ్యాలను చిత్రీకరిస్తున్న క్రమంలో తన చేతిలోంచి సెల్ ఫోన్ జారి కిందపడిపోయింది. కెమెరా అన్ లో వున్నందున విమాన దృశ్యాలతో పాటుగా సెల్ ఫోన్ కిందపడుతున్నప్పడు దృశ్యాలు కూడా అందులో నమోదయ్యాయి.

ఆలా విమానంలోంచి జారిపడిన మొబైల్ కెంటుకీ నగరంలోని ఓ ఇంట్లోని పెరట్లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. దీనిని ఆ ఇంట్లోని గార్డనర్లు చూసి ఇదిగో నీ ఫోన్ అని ఒకరు మరోకరితో అనగా, ఇది నాది కాదు.. నా ఫోన్ నా జేబులోనే వుంది అని మరోకరు బదులివ్వడం.. తీరా దాన్ని తీసి చూడగా, వీడియో రికార్డింగ్ కూడా అన్ లోనే వుందన్న విషయాన్ని గమనించి.. రికార్డైన దృశ్యాలను చూడటం ఇదంతా చకచకా జరిగిపోయింది.

చివరకు బ్లేక్ హెండర్సన్ తన టెలికాం కంపెనీ సహాయంతో జీపీఎస్‌ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ను తిరిగి పొందాడు. హెండర్సన్‌ బంధువైన రాబర్ట్ ర్యాన్ స్మార్ట్ ఫోన్ లో రికార్డయిన దృశ్యాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారాయి. అయితే ఇంకా మీకు ఒక డౌట్ వుంది కదూ. ఇంతకీ ఆ సెల్ ఫోన్ ఏ కంపెనీదనేగా.. సామ్ సంగ్ గాలక్సీ ఎస్ 5. అయితే కేవలం సెల్ ఫోన్ అమ్మకాల కోసం సామ్ సంగ్ ఇలాంటి వార్తలను సృష్టిస్తుందన్న విమర్శకులు కూడా లేకపోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : you tube  robert ryan  blake henderson  kentucky  Samsung  viral video  social media  

Other Articles